Pawan Kalyan: జ‌క్క‌న్న రికార్డులు చెరిపేసే ద‌మ్ము అత‌డికే ఉందా..? అత‌డో నిశ్శ‌బ్ధ యుద్ద‌మా..?

బాహుబలి ఇండియన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్‌. ఇప్పటికీ ఇండియన్ మూవీస్ అన్ని నాన్‌ బాహుబలి రికార్డ్‌లతోనే పోటి పడుతున్నాయి. అయితే ఈ రికార్డ్‌లను...

Pawan Kalyan:  జ‌క్క‌న్న రికార్డులు చెరిపేసే ద‌మ్ము అత‌డికే ఉందా..? అత‌డో నిశ్శ‌బ్ధ యుద్ద‌మా..?
pawan-kalyan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 28, 2021 | 8:25 PM

బాహుబలి ఇండియన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్‌. ఇప్పటికీ ఇండియన్ మూవీస్ అన్ని నాన్‌ బాహుబలి రికార్డ్‌లతోనే పోటి పడుతున్నాయి. అయితే ఈ రికార్డ్‌లను ట్రిపులార్ బ్రేక్‌ చేస్తుందన్ననమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ జనాలు. అంటే రాజమౌళి రికార్డ్‌లను రాజమౌళే బ్రేక్‌ చేయబోతున్నారన్న మాట. మరి ఈ రికార్డ్‌లను బ్రేక్‌ చేసే సత్తా మరే హీరోకు లేదా..? ఈ విషయంలో కొత్త డిస్కషన్‌ తెర మీదకు వచ్చింది. రాజమౌళి సెట్ చేసే బిగ్ రికార్డ్స్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రేక్‌ చేస్తారంటున్నారు ఫ్యాన్స్‌. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న పీరియాడిక్ సినిమాతో గత ఇండస్ట్రీ రికార్డ్‌లన్నీ తుడిచి పెట్టేస్తారంటున్నారు. అందుకు ఎగ్జామ్‌పుల్‌ కూడా చూపిస్తున్నారు. గతంలో మగధీర సినిమాతో జక్కన్న సెట్ చేసిన రికార్డ్‌ను అత్తారింటికి దారేది సినిమాతో బ్రేక్‌ చేశారు పవన్‌. ఇప్పుడు ట్రిపులార్ విషయంలోనూ అదే సీన్‌ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌. జక్కన్న ఎంత భారీ రికార్డ్ సెట్ చేసినా… దాని బ్రేక్‌ చేసే మార్కెట్ స్టామినా పవన్‌ ఒక్కరికే ఉందంటున్నారు.

అందుకు త‌గ్గట్ల‌గానే ప‌వ‌న్ ఇప్పుడు వ‌ర‌స సినిమాలు చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. మరి నిజంగానే పవన్‌ ఆ రేంజ్‌లో సత్తా చాటుతారా..? అభిమానుల అంచ‌నాల‌ను నిజం చేస్తారా..? త‌న ప‌వ‌ర్ ఫుల్ ఫ్యాన్ బేస్‌తో పంజా విసురుతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: అన్న‌గారికి బాల‌య్య ఘ‌న‌నివాళి.. పెద్దాయ‌నపై చినతార‌క‌రాముడి భావోద్వేగ పోస్ట్ వైర‌ల్

బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగ్గా ఇవ్వ‌లేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజ‌న్.. మంత్రి రిప్లై భ‌లే ఫ‌న్నీ