Nandamuri Ramakrishna : అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోయామని నటసార్వభౌముడు....

Nandamuri Ramakrishna : అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా  నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ
Nandamuri Ramakrishna
Follow us
Venkata Narayana

|

Updated on: May 28, 2021 | 9:16 PM

NTR son Nandamuri Ramakrishna clarification : కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోయామని నటసార్వభౌముడు.. దివంగత ఎన్టీఆర్ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ వివరణ ఇచ్చారు. “ఈ రోజు నాన్నగారి 98వ జయంతి. ప్రతిసారీ ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. అయితే ఈసారి కరోనా తీవ్రత వల్ల వెళ్లలేకపోతున్నాం. ఇది ఆయన అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా, ధైర్యంగా ఉండండి. ఇక నాన్నగారి గురించి మాట్లాడాలంటే ఎంతసేపు మాట్లాడినా తనివితీరదు. ఆయన గురించి రెండు మాటల్లో చెప్పాలంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు అనే మాటను ఆయన నిజం చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ.. వారి రూపాల్లో మనందరినీ అలరించి మనకు దేవుడయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు…

రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారిదే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఆయనదే. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనే. ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. ఆ యుగపురుషుడిని అందరూ ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలని నందమూరి అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నా. జోహార్ ఎన్టీయార్, జై తెలుగు తల్లి, జోహార్ హరికృష్ణ” అని వివరణ ఇచ్చారు నందమూరి రామకృష్ణ.

Read also : RRR : రఘురామను అరెస్టు చేసిన కేసు కొత్త మలుపు.. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు