ఇంతకీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?

ఇంటర్ ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మే 27వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఫెయిలైన విద్యార్థుల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ పూర్తయ్యిందని హైకోర్టుకు ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే.. ఈ నెల 16నే ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని కోర్టుకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫలితాలు, సమాధాన పత్రాలు ఒకేసారి ఆన్‌లైన్‌లో పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కేసులో గ్లోబరినా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. […]

ఇంతకీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 15, 2019 | 3:36 PM

ఇంటర్ ఫలితాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మే 27వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఫెయిలైన విద్యార్థుల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ పూర్తయ్యిందని హైకోర్టుకు ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే.. ఈ నెల 16నే ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని కోర్టుకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫలితాలు, సమాధాన పత్రాలు ఒకేసారి ఆన్‌లైన్‌లో పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం కేసులో గ్లోబరినా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి కేసు విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.