Hyderabad: కళాశాలలోనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ (బీటెక్) 3వ సంవత్సరం విద్యార్థి వంశీ పటేల్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన విద్యార్ధులు.. మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ఒళ్లంగా కాలిపోవడంతో.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పిటల్‌లో విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది. కళాశాలలోనే మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో.. క్యాంపస్ లో గందరగోళం నెలకొంది.
కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు యత్నించాడా.. లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా.. అనే దానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కాగా, ఈ ఘటన కాలేజీలో జరిగినప్పటికీ యజమాన్యం స్పందించలేదు. తమకు ఏమీ తెలియదని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..