Sankranti Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు...
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. పండగ వేళ ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్లల్లో కూడా రద్దీగా ఉంటుంది. దీంతో రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఏపీలోని ఇతర స్టేషన్‌ల నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపుతోంది.
ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 16న తిరుపతి నుంచి కాచిగూడ ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈనెల 17న నర్సాపూర్ నుంచి కాచిగూడకు సువిధ ట్రైన్ నడపనున్నారు.
#Sankranti Special Trains between Narsapur – Kacheguda @drmhyb @VijayawadaSCR pic.twitter.com/jledYu8vS5
— South Central Railway (@SCRailwayIndia) January 5, 2022
మచిలిపట్నం నుంచి కర్నూలు సిటీకి, కర్నూలు నుంచి మంచిలిపట్నంకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు. తిరుపతి నుంచి నాందేడ్, కాకినాడ నుంచి లింగంపల్లి, లింగంపల్లి- కాకినాడ, నర్సాపూర్-సికింద్రాబాద్, కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్-కాచిగూడ, మచిలిపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్- మచిలిపట్నం, తిరుపతి-అకోలా, అకోలా- తిరుపతి, పూర్ణ-తిరుపతి, తిరుపతి – పూర్ణం, కాచిగూడ- కొల్లం, కొల్లం-కాచిగూడ, సికింద్రాబాద్-కొల్లం ఇలా ఇంకా చాలా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు.