AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Trains: దసరాకు ఊరెళ్తున్న వారికి గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు..

Dasara Trains: దసరగా పండగ జోష్‌ అప్పుడే ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పట్నం పల్లె బాట పడుతోంది. ప్రయాణికులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు...

Dasara Trains: దసరాకు ఊరెళ్తున్న వారికి గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు..
Train
Narender Vaitla
|

Updated on: Sep 26, 2022 | 7:18 PM

Share

Dasara Trains: దసరగా పండగ జోష్‌ అప్పుడే ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పట్నం పల్లె బాట పడుతోంది. ప్రయాణికులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికు రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు..

* సికింద్రాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్ (బుధవారం) వెళ్లే 07265 ట్రెయిన్‌ నెంబర్‌గల రైలు 21.45 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 10.50 గంటలకు చేరుకుంటుంది. 28-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.

* యశ్వంత్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ (గురువారం) వెళ్లే 07266 నెంబర్‌ రైలు 15.50 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 4.15 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 29-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.

* తిరుపతి నుంచి సికింద్రాబాద్ (ఆదివారం) వెళ్లే 07481 నెంబర్‌ రైలు 21.10కి బయలు దేరి తర్వాతి రోజు 09.30 గంటలకు చేరుకుటుంది. 09-10-2022 తేదీన ఈ రైలు బయలు దేరుతుంది.

* సికింద్రాబాద్ నుంచి తిరుపతి (సోమవారం) వెళ్లే 07482 నెంబర్‌ రైలు 16.15 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 05.20కి గమ్యాన్ని చేరుకుంటుంది. 10-10-2022 తేదీన బయలుదేరుతుంది.

* సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌ – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉమాద్‌నగర్‌, షాద్‌ నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూల్‌ సిటీ, ధోన్‌, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్‌, ఎలకం స్టేషన్‌లలో ఆగుతుంది.

* ఇక తిరుపతి – సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్‌, మంత్రాలయం, రాయ్‌చూర్‌, తాండూర్‌, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట్‌ స్టేషన్స్‌లో ఆగుతుంది.

Dasara Special Trains

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి
రోహిణి కార్తె ఎప్పుడు?ఈసమయంలో రోళ్లు పగిలేంత ఎండలు ఎందుకు కొడతాయి