Hyderabad: నగరవాసులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే తీరుపై మండిపడుతున్న ప్యాసింజర్స్..

ఎంఎంటీఎస్ (MMTS) రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ చేసింది. నిర్వహణ పనుల కారణంగా పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రేపు (ఆదివారం) లింగంపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్...

Hyderabad: నగరవాసులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే తీరుపై మండిపడుతున్న ప్యాసింజర్స్..
Follow us

|

Updated on: Sep 10, 2022 | 8:29 PM

ఎంఎంటీఎస్ (MMTS) రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ చేసింది. నిర్వహణ పనుల కారణంగా పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రేపు (ఆదివారం) లింగంపల్లి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఫలక్ నుమ మధ్య రాకపోకలు సాగించే 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రయాణీకులు వేరే ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. అయితే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వివిధ నగరాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్న దక్షిణ మధ్య రైల్వే (SCR) ఉన్నపళంగా ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఆదివారం రాకపోకలు అధికంగా సాగించే సమయాల్లో ఇలా చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రత్యేక రైళ్లను నడిపించకపోగా ఉన్నవాటినే రద్దు చేయడంపై మండిపడుతున్నారు. నగరంలో చౌకగా ప్రయాణం చేసే ప్రజారవాణా సౌలభ్యాన్ని ప్రయాణీకులకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లింగంపల్లి – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140, హైదరాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులు రద్దయ్యాయి. ఫలక్ నుమ – లింగంపల్లి మధ్య 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 రైళ్లు సర్వీసులు అందించలేవని వెల్లడించింది. లింగంపల్లి – ఫలక్ నుమ మధ్య 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 రైళ్లు, సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య 47150, లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య 47195 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి
Mmts Trains Cancellation

Mmts Trains Cancellation

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..