ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. దొంగతో కలిసి ఎస్ఐ భలే స్కెచ్ వేశాడుగా..

అతనో పోలీస్ ఆఫీసర్.. పేరుకే ఆఫీసర్ కానీ అతని మైండ్ లో మొత్తం క్రిమినల్ ఆలోచనలే.. ఖాకీ చొక్కా ఒంటి మీద ఉందన్న సంగతి మరిచి వంద కోట్ల ఆస్తులపై కన్నేశాడు .. తన స్కెచ్ వర్క్ అవుట్ చేయడం కోసం ఆన్‌లైన్‌ బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకున్న ఓ ఫార్మా ఉద్యోగిని పావుగా వాడుకున్నాడు. ప్లాన్ అమలు చేసి అస్తి పత్రాలు సంపాదించారు.

ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. దొంగతో కలిసి ఎస్ఐ భలే స్కెచ్ వేశాడుగా..
Irs Samuel House Robbery Case
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Basha Shek

Updated on: Jul 01, 2023 | 3:32 PM

అతనో పోలీస్ ఆఫీసర్.. పేరుకే ఆఫీసర్ కానీ అతని మైండ్ లో మొత్తం క్రిమినల్ ఆలోచనలే.. ఖాకీ చొక్కా ఒంటి మీద ఉందన్న సంగతి మరిచి వంద కోట్ల ఆస్తులపై కన్నేశాడు .. తన స్కెచ్ వర్క్ అవుట్ చేయడం కోసం ఆన్‌లైన్‌ బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకున్న ఓ ఫార్మా ఉద్యోగిని పావుగా వాడుకున్నాడు. ప్లాన్ అమలు చేసి అస్తి పత్రాలు సంపాదించారు. చివరకు విషయం బయటకు పొక్కడంతో ఈ క్రిమినల్ పోలీస్ అసలు గుట్టు బయట పడింది.. రిటైర్డ్ ఐటి కమిషనర్ శామ్యూల్ మోసం చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దొంగ, పోలీస్ కలిసి ఆడిన డ్రామా పోలీసులను సైతం విస్తూ పోయేలా చేస్తోంది. రిటైర్డ్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌మాజీ ఐఆర్‌ఎస్‌ ఉద్యోగి సామ్యూల్‌ ఇద్దరు కుమారులు ఇద్దరూ ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు . ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని గాందీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లో… ఆయన ఒంటరిగా నివాసం ఉంటున్నారు . ఓ ఎస్సైకి ఈ మాజీ ఐఆర్‌యస్‌ అధికారి పరిచయం అవడంతో అప్పుడప్పుడు సామ్యూల్‌ ఇంటికి వచ్చి పార్టీ చేసుకునేవాడు . సామ్యూల్‌కు శంషాబాద్‌ ప్రాంతంలో 25 ఎకరాల స్థలంతో పాటు వైజాగ్‌లో పది ప్లాట్లు ఉన్నాయని గమనించిన ఆ ఎస్‌ఐ శంషాబాద్‌ సమీపంలోని ల్యాండ్‌లో మూడు ఎకరాలను 90 లక్షలకు కొనుగోలు చేసాడు . కొద్దిరోజులకు ఎకరా కోటి రూపాయలకు ఆ ఎస్సై వేరే వ్యక్తులకు అమ్మేసాడు . మిగిలిన 22 ఎకరాల స్థలంతో పాటు వైజాగ్‌లోని పది ప్లాట్లను ఎలాగైనా చేజెక్కించుకోవాలని ఆ ఎస్సై ప్లాన్‌ చేసాడు . ఎవరికీ అనుమానం రాకుండా సామ్యూల్‌ ఇంట్లో ఓ పనిమనిషిని కూడా అరేంజ్‌ చేసాడు . సామ్యూల్‌ ఇటికి ఎవరు వస్తున్నారు ?ఎవరితో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నాడు అన్న వివరాలన్నీ పనిమనిషి ద్వారా ఆ ఎస్సై తెలుసుకునేవాడు . హైదరాబాద్ లోని నిజాంపేటకు చెందిన సురేందర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మెన్‌ను రంగంలోకి దింపిన ఎస్సై వైజాగ్‌లోని ప్లాట్లు కొంటానంటూ సామ్యూల్‌ ఇంటికి పంపించాడు . అప్పటికే ఆ ప్లాట్లు అమ్మాలన్న ఉద్దేశంతో ఉన్న సామ్యూల్‌ సురేందర్‌ మాటలు నమ్మేసాడు .

కాఫీలో మత్తు మందు..

సురేందర్‌తో పాటు వైజాగ్‌ ఇన్‌కంటాక్స్‌ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లిన సామ్యూల్‌కు అక్కడ ఓ చేదు అనుభవం ఎదురయ్యింది . కొద్దిసేపు మత్తులోకి జారుకున్న ఆయన దగ్గర అరవై వేల రూపాయలు చోరీ అయ్యాయి . సామ్యూల్‌తో పాటు ఉన్న సురేందర్‌ గెస్ట్‌ హౌజ్‌ సిబ్బందిని అనుమానించాడు . కానీ అప్పటికే ..వారికి హైదరాబాద్‌ ట్రెయిన్‌ టైమ్‌ అవుతుండటంతో ఆ గొడవను అక్కడే వదిలేసి ట్రెయిన్‌లో హైదరాబాద్‌కు వచ్చేసారు . కొద్దిరోజుల తరువాత …మరోసారి సామ్యూల్‌ ఇంటికి వచ్చిన సురేందర్‌ ప్లాట్‌ గురించి మాట్లాడుతున్న టైమ్‌లోనే సామ్యూల్‌ తో పాటు , వంట మనిషి మినహా ఇంట్లో ఎవరూ లేరని అబ్జర్వ్‌ చేసాడు . గతంలో ఫార్మా కంపెనీల్లో పనిచేసిన సురేందర్‌కు…మత్తు మందుల గురించి బాగా తెలుసు . ఓ రోజు సామ్యూల్‌ తాగాల్సిన కాఫీలో మత్తు కలిపాడు కానీ అనుకుకుండా…ఆ కాఫీని ఇంట్లో ఉన్న వంటమనిషి తాగేసింది . దీంతో ఆమె మత్తులోకి జారుకుంది . కంగారు పడిపోయిన ఆ రిటైర్డ్‌ ఐఆర్‌యస్‌ ఆఫీసర్‌ సామ్యూల్‌…ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించాడు . ఆ తరువాత కొద్దిరోజులు సెలవు తీసుకోవాలంటూ ఆమెకు సూచించాడు . ఇదే అదనుగా భావించిన సురేందర్‌ ఇంట్లో సామ్యూల్‌ ఒక్కడే ఉన్న టైమ్‌లో తన ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేయాలనుకున్నాడు . గత నెల 30న సామ్యూల్ ఇంటికి వచ్చిన సురేందర్‌ ప్లాట్‌ ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ కావాలని అడిగాడు . అప్పటికే..భారీ చోరీ చేసేందుకు పక్కా స్కెచ్‌తో ఉన్న సురేందర్‌…ఆ రిటైర్డ్‌ అదికారి తన బీరువాలో ఉన్న పది ప్లాట్ల పేపర్‌లు తెచ్చేలోపు తనతో పాటు తెచ్చిన ఇడ్లీలో మత్తుమందు కలిపేసాడు . కొద్దిసేపటికే ఆ ఇడ్లీ తిన్న సామ్యూల్‌ మత్తులోకి జారుకున్నాడు . ఏమాత్రం ఆలస్యం చేయకుండాబీరువాలో ఉన్న ఐదు లక్షల నగదుతో పాటు కొంత బంగారం, పది ప్లాట్ల ఒరిజినల్‌ డాక్యుమెంట్లను చోరీ చేసిన నిందితుడు సురేందర్‌ సామ్యూల్‌ చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు .

ఆస్పత్రిలో చంపేందుకు ప్లాన్‌..

రాజమండ్రిలో ఉన్న సామ్యూల్‌ సోదరి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ అటెండ్‌ చేయలేదు. దీంతో సోమాజిగూడలో ఉన్న తన కూతురు , అల్లుడును సామ్యూల్‌ ఇంటికి వెళ్లి చూడాలంటూ చెప్పింది . వాల్లు మరుసటి రోజు మే 31 వ తేదీన వచ్చేసరికి సామ్యూల్‌ అపస్మారక స్థితిలో కనిపించాడు . వెంటనే ఆయనను హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌కు షిఫ్టు చేసారు . సామ్యూల్‌ ఇంకా చనిపోలేదని భావించిన సురేందర్‌ హాస్పిటల్‌కు వచ్చి అన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్లిపోండి అంటూ బందువులతో అన్నాడు. కానీ సురేందర్‌ ప్రవర్తనపై వారికి అనుమానం రావడంతో వారే దగ్గరుండి చూసుకున్నారు . వాస్తవానికి బందువులు వెళ్లిపోతే హాస్పిటల్‌లో సామ్యూల్‌ ప్రాణాలు తీయాలన్నది సురేందర్‌ ప్లాన్‌ అని పోలీసుల విచారణలో తరువాత బైటపడింది . ఆ రోజు సురేందర్‌ మాటలు నమ్మి బంధువులు వెళ్లిపోయుంటే ఈ రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అదికారి ప్రాణాలు పోయేవంటున్నారు పోలీసులు . హాస్పిటల్‌నుండి డిశ్చార్జి అయిన సామ్యూల్‌ సురేందర్‌పై అనుమానంతో ఫిర్యాదు చేసాడు . తీగలాగితే డొంక కదిలినట్టు సినీ ఫక్కీలో రిటైర్డ్‌ ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్‌ సామ్యూల్‌ ఇంట్లో జరిగిన చోరీ కేసు బయటపడింది . పోలీసులు ఆశ్చర్యపోయిన విషయం ఏంటి అంటే, సురేందర్‌ కొట్టేసిన ఆ ప్లాట్‌ పేపర్‌లు సామ్యూల్‌కు పరిచయం ఉన్న ఆ ఎస్‌ఐ వద్ద రికవరీ అవటం . దీంతో సురేందర్‌తో కలిసి ఆ ఎస్సై ఈ స్కెచ్‌ వేసాడా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది .

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..