TSRTC: విజయవాడ, బెంగళూరు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ఆఫర్..
విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఆయా రూట్లలో టికెట్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఆయా రూట్లలో టికెట్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఆ రెండు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణీకులు టికెట్లను ముందుస్తు రిజర్వేషన్ చేసుకుంటే.. వారి తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ రూట్లలో ముందస్తు బస్సు సర్వీసులకు జూలై 2 నుంచి 10 శాతం రాయితీ అమలవుతుందని.. ఆగష్టు 15 వరకు ఇది అందుబాటులో ఉంటుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఈ రెండు మార్గాలలోనూ ప్రయాణీకుల రద్దీ తరచూ ఎక్కువగా ఉంది. టికెట్ల రేట్ల విషయంలో వారిపై ఆర్ధిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ 10 శాతం రాయితీ సదుపాయాన్ని ప్రవేశపెట్టామని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాబిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రానూపోనూ ప్రయాణాన్ని ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ. 50, బెంగళూరు మార్గంలో రూ. 100 ఒక్కో ప్రయాణీకుడు ఆదా చేయవచ్చు. ఆగష్టు 15 వరకు ఉండే ఈ సదుపాయాన్ని ప్రతీ ప్రయాణీకుడు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, ముందస్తు రిజర్వేషన్ టికెట్ల కోసం తమ అధికారిక సైట్‌ను www.tsrtconline.com సంప్రదించాలని కోరారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని #TSRTC నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 1, 2023