Hyderabad Metro: విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. ఇకపై 20 ట్రిప్పుల ఛార్జ్‌తో..!
విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. జూలై 1వ తేదీ నుంచి మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. జూలై 1వ తేదీ నుంచి మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 ట్రిప్పుల ఛార్జ్‌తో నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతానికి 30 ట్రిప్పుల ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించింది. ఇందుకోసం విద్యార్ధులు సరికొత్త స్మార్ట్ కార్డును తీసుకోవాలని సూచించింది.
ఇక ఈ స్మార్ట్ కార్డులను జేఎన్టీయూ, ఎస్.ఆర్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్ నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయ్ దుర్గ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తీసుకోవచ్చునని తెలిపింది. ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్ 9 నెలలు అందుబాటులో ఉంటుంది.
2023 జూలై 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్‌ను విద్యార్ధులు వినియోగించుకోవచ్చు. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుందని స్పష్టం చేసింది మెట్రో సంస్థ. 1998, ఏప్రిల్ 1 తర్వాత జన్మించిన విద్యార్ధులు ఈ పాస్‌కు అర్హులని పేర్కొంది. కాగా, విద్యార్ధులు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని మెట్రో సంస్థ ఎండీ ప్రకటించారు.
Introducing the Metro Student Pass. An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way.
Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023