Kukatpally: కూకట్‌పల్లిలో కుంగిన భూమి .. బ్లాస్టింగ్ కారణమా..? ఆ ఇళ్లను ఖాళీ చేయాలి.
హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో రోడ్డు కుంగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌతమి నగర్ లోని ప్రణీత్ హోమ్స్ వద్ద సగానికి పైగా రోడ్డు కుంగిపోయింది. ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో గుంత తవ్వడం కోసం జరిపిన బ్లాస్టింగ్ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో రోడ్డు కుంగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గౌతమి నగర్ లోని ప్రణీత్ హోమ్స్ వద్ద సగానికి పైగా రోడ్డు కుంగిపోయింది. ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో గుంత తవ్వడం కోసం జరిపిన బ్లాస్టింగ్ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.దాదాపు 100 అడుగులకుపైగా గుంత తవ్వడం కోసం జెలటిన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్ చేయడం ఎంత వరకు న్యాయమని డిమాండ్ చేస్తున్నారు. అయితే రోడ్డు పక్కనే ఉన్న నాలుగు అపార్ట్‌మెంట్స్‌కు ప్రమాదం పొంచి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అయితే తాము ఇళ్ళను వదిలి ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు. ఖాళీ చేయమని తెగేసి చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..