ప్రయివేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా.. పండుగ వేళ.. ప్రత్యేక బృందాల తనిఖీలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు.

ప్రయివేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా.. పండుగ వేళ.. ప్రత్యేక బృందాల తనిఖీలు..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 8:20 AM

Hyderabad RTA Raids : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు. వందలాది బస్సులను చెక్ చేసిన అధికారులు రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణికులతో పాటు లగేజిని కూడా రవాణా చేస్తున్న బస్సుల పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్‌బీ నగర్, పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద, బెంగళూరు హైవే మార్గంలోని శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని తొండుపల్లి 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను ఆర్టీఏ అధికారు లు తనిఖీ చేశారు. ఎల్‌బీ నగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మరో ఆరు బస్సుల పై కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి బస్సును ఆపి డాక్యుమెంట్లను చెకింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. రోడ్డు ట్యాక్స్ కట్టకపోవడం లగేజీ క్యారీ చేయడం పరిమితికి మించిన ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆధికారులు తెలిపారు.

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!