Hyderabad: అయ్యో దేవుడా.. సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన గర్భిణి.. బాత్రూమ్‌కు వెళ్లి..
పాపం.. వారిద్దరూ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. అంతాబాగానే ఉంది.. భార్య కడుపులో ఓ కాయపడగానే.. దంపతులిద్దరూ సంతోషంలో మునిగితేలారు.. గర్భం దాల్చి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో.. సీమంతం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. సీమంతం వేడుకకు పుట్టింటికి రావాలని చెప్పడంతో ఆమె ఆనందంతో వెళ్లింది..
పాపం.. వారిద్దరూ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. అంతాబాగానే ఉంది.. భార్య కడుపులో ఓ కాయపడగానే.. దంపతులిద్దరూ సంతోషంలో మునిగితేలారు.. గర్భం దాల్చి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో.. సీమంతం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. సీమంతం వేడుకకు పుట్టింటికి రావాలని చెప్పడంతో ఆమె ఆనందంతో వెళ్లింది.. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆమె.. విధిరాతకు బలైంది. సీమంతం కోసం వచ్చి పుట్టింట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారిపడి, చికిత్స పొందుతూ ఓ గర్భిణి ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, కల్పన భార్యభర్తలు.. హేమంత్ ప్రైవేట్ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కల్పన (28) ఆరు నెలల గర్భవతి. ఇంట్లోనే ఉంటుంది. అయితే, ఏడవనెల దగ్గరపడుతుండటంతో సీమంతం నిమిత్తం ఆమెను సంజీవయ్యనగర్ లోని పుట్టింటికి 15 రోజుల క్రితం పంపించారు.
ఈ క్రమంలో కల్పన గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో జారి కిందపడింది. గమనించిన కుటుంబసభ్యులు.. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫిట్స్, గుండెపోటు రావడంతో కల్పన మృతి చెందినట్లు వైద్యులు, పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..