Petrol-Diesel Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. 14రోజుల తర్వాత ఎలా ఉన్నాయంటే?
పెట్రో ధరల పెరుగుదల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత పెట్రోల్ ధరలు ఆల్‌టైం హై రికార్డును సృష్టించాయి.
Petrol-Diesel Price Today: ఏప్రిల్ 19, మంగళవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు విడుదలయ్యాయి. దేశంలో పెట్రోల్, ధరలు వరుసగా 14వ రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా ఏప్రిల్ 6న ధరలు పెరగ్గా గత రెండువారాల్లో పైసా కూడా పెంపు చోటుచేసుకోలేదు. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105కి, ముంబైలో లీటరుకు రూ.120కి పెరిగింది. ఇవి కాకుండా చెన్నైలో పెట్రోలు ధర రూ.110 ఉండగా, కోల్‌కతాలో లీటరు రూ.115కు మించి ఉంది. ఇటు హైదరాబాద్‌లో 119.49 కాగా, విజయవాడలో 121.20గా కొనసాగుతోంది.
నవంబర్ 4, 2021 తర్వాత, దేశవ్యాప్తంగా మార్చి 22, 2022న నేరుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చమురు కంపెనీలు మార్చి 22 నుండి చమురు ధరలను పెంచడం ప్రారంభించాయి. ఇది ఏప్రిల్ 6 వరకు కొనసాగింది. ఈ సమయంలో, రాజధాని ఢిల్లీలో కేవలం 16 రోజుల్లోనే పెట్రోల్ మరియు డీజిల్ ధర లీటరుకు రూ.10 పెరిగింది. మార్చి 21, 2022న, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41 ఉండగా, ఏప్రిల్ 6న లీటరుకు రూ.105.41కి పెరిగింది. అయితే గత 13 రోజులుగా చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచలేదు.
నేటి ధరలను ఇక్కడ చూడండి
నగరం | పెట్రోల్ (రూ/లీటర్) | డీజిల్ (రూ/లీటర్) |
ఢిల్లీ | 105.41 | 96.67 |
ముంబై | 120.51 | 104.77 |
చెన్నై | 110.85 | 100.94 |
కోల్‌కతా | 115.12 | 99.83 |
హైదరాబాద్ | 119.49 | 105.49 |
విజయవాడ | 121.2 | 107.04 |
లక్నో | 105.25 | 96.83 |
జైపూర్ | 118.03 | 100.92 |
పాట్నా | 116.23 | 101.06 |
జమ్మూ | 106.52 | 90.26 |
రాంచీ | 108.71 | 102.02 |
మీరు మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ తాజా ధరలను కూడా చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఖరీదైన ఇంధనం కారణంగా, ప్రయాణ, రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఇదే కాకుండా, ప్రజా రవాణాలో ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారింది. ఇది మాత్రమే కాదు, పెరుగుతున్న చమురు ధరల కారణంగా రవాణా ఛార్జీలు కూడా ఆకాశన్నంటాయి. దీని కారణంగా రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతిదాని ధర కూడా పెరిగింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై విధించే పన్నులో ప్రభుత్వం కొంత కోత పెడుతుందని దేశంలోని సామాన్యులు ఆశిస్తున్నారు. అయితే, చమురుపై పన్ను తగ్గించే సామర్థ్యం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.
Read Also…. Hyderabad: రివర్స్ పేమెంట్స్ పేరుతో కొత్తరకం సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..