AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రివర్స్ పేమెంట్స్ పేరుతో కొత్తరకం సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..

Hyderabad: నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన ఇల్లు అద్దెకు ఇస్తానని ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన పెట్టాడు. నెలకు రూ.20 వేలు అద్దిగా అందులో పేర్కొన్నాడు. అలా నమ్మించి రివర్స్ పేమెంట్స్ పేరుతో రూ.12 లక్షలు దోచేశాడు.

Hyderabad: రివర్స్ పేమెంట్స్ పేరుతో కొత్తరకం సైబర్ మోసాలు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..
Cyber
Ayyappa Mamidi
|

Updated on: Apr 19, 2022 | 7:07 AM

Share

Hyderabad: నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన ఇల్లు అద్దెకు ఇస్తానని ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన పెట్టాడు. నెలకు రూ.20 వేలు అద్దిగా అందులో పేర్కొన్నాడు. దీనిని గమనించిన కేటుగాళ్లు(Cyber Fraudster) ఆయనకు కాల్ చేసి తాను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అధికారినని పరిచయం చేసుకున్నాడు. పూణే నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయినందున అద్దెకు ఇల్లు కావాలని తెలిపాడు. అడ్వాన్స్ చెల్లించడానికి ఒక మెలిక పెట్టాడు. ఇందుకోసం ముందుగా ఒక రూపాయి చెల్లిస్తే.. సీఐఎస్‌ఎఫ్‌ విభాగానికి చెందిన బ్యాంక్‌ ఖాతా నుంచి రెట్టింపు సొమ్ము జమ అవుతుందని నమ్మించాడు. సీఐఎస్‌ఎఫ్‌లో రివర్స్‌ పేమెంట్‌(Reverse Payment) విధానం ఉంటుందని చెప్పాడు. ఇందుకోసం ముందుగా ఒక రూపాయి సదరు ఖాతాకు బదిలీ చేయాలని కోరాడు. నిజమని నమ్మిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అలా చేయగానే వెంటనే అతనికి రెండు రూపాయలు తిరిగి జమ అయ్యాయి.

దీంతో ఇది నిజమేనని నమ్మిన సదరు ఇంటి యజమాని డెబిట్‌ కార్డ్‌ నుంచి 12 లావాదేవీల్లో రూ.11.99 లక్షలను సైబర్‌ నేరస్తుల అకౌంట్ కు బదిలీ చేశాడు. తరువాత డబ్బులు రిటర్న్ రాకపోవటంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఇప్పటివరకు లాటరీ వచ్చిందని, క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ అంటూ  రకరకాల మోసాలు చేసిన సైబర్‌ నేరస్తులు.. తాజాగా రివర్స్‌ పేమెంట్‌ విధానంతో దోపిడీకి దిగుతున్నారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్.., ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర, హరియాణాలోని నుహ్‌ జిల్లాల నుంచి జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. నిందితులు వినియోగించే సిమ్‌ కార్డ్‌లు, బ్యాంక్‌ ఖాతాలు అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని చిరునామాలతో ఉన్నట్లు గుర్తించారు. మోసాలకు పాల్పడేది మాత్రమే రాజస్థాన్, యూపీ, హరియాణా బార్డర్ల నుంచి చేస్తుంటారు. దీంతో నేరస్తులను ట్రాక్‌ చేయడం కష్టంగా మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఐటీ ఉద్యోగులు, బ్యాంకింగ్‌ ప్రొఫెషనల్స్, ఉన్నతోద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. ఇలాంటి మోసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..

Anand Mahindra: 10 నిమిషాల్లో డెలివరీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Gold Silver Price Today: బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..