TS Polycet 2022: ఆలస్యంకానున్న తెలంగాణ పాలీసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. కారణం ఇదే!

తెలంగాణ పాలిసెట్‌కు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలో మొదలవుతుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (TS SBTET) ప్రకటించినా.. దరఖాస్తు ప్రక్రియ మరికొంత ఆలస్యం కానుంది..

TS Polycet 2022: ఆలస్యంకానున్న తెలంగాణ పాలీసెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. కారణం ఇదే!
Ts Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 19, 2022 | 7:43 AM

TS Polycet 2022 application date: తెలంగాణ‌లో 2022-23 విద్యా సంవ‌త్సరానికి గాను పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022) నోటిఫికేష‌న్ మార్చి 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పాలిసెట్‌కు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలో మొదలవుతుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (TS SBTET) ప్రకటించినా.. దరఖాస్తు ప్రక్రియ మరికొంత ఆలస్యం కానుంది. కనీసం మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా. పాలిసెట్‌ టైంటేబుల్‌లో నిర్ధిష్ట తేదీని ప్రకటించలేదు. రిజిస్ట్రేషన్‌ రెండో వారంలో మొదలవుతుందని ప్రకటించినప్పటికీ అది ఇంకా ప్రారంభం కాలేదు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్‌ నంబర్లు కేటాయిస్తేనే పాలిసెట్‌ దరఖాస్తుల సమర్పణ సాధ్యమవుతుంది. పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 14వ తేదీతో ముగిసింది. తత్కాల్‌ పథకం కింద రూ.వెయ్యి ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 20 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత కూడా తప్పొప్పులను సరిచూసుకొని… హాల్‌టికెట్ల సంఖ్యలను కేటాయించడానికి మరో వారం రోజులు పట్టొచ్చని అంచనా. దీనినిబట్టి ఈ నెలాఖరుకు మాత్రమే పాలిసెట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

కాగా పాలీసెట్ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. పాలీసెట్ ఎంట్రన్స్ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్‌ చేసుకోవచ్చు.

Also Read:

NPC Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక!

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..