APPSC Group-IV: మే 1న ఏపీపీఎస్సీ గ్రూప్-4 నమూనా పరీక్ష.. ఇలా నమోదు చేసుకోండి..
ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మే 1న విజయవాడలో నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు..
APPSC Group-4 sample test 2022: యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మే 1న విజయవాడలో నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు నీల సురేష్, కార్యదర్శి జంపాన మధుబాబు ఏప్రిల్ 17న తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 29వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9391878797 నంబరును సంప్రదించాలని కోరారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
Also Read: