AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పోలీసులపై జంతు ప్రేమికుడి బూతు పురాణం.. కండ కావరమంటూ నెటిజెన్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: అనవసరంగా పోలీసులపై బూతు పురాణం మొదలెట్టాడు ప్రణయ్ అనే వ్యక్తి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రో కార్ నెంబర్ 2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్న టైంలో ప్రణయ్ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు. ఉన్నటుండీ తన నోటికి పని చెప్పిన ప్రణయ్ చెప్పరాని మాటలతో పోలీసులను దూషించాడు. దీంతో చుట్టుపక్కల వారంతా నోరేళ్ళబెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళ పోలీసులు ఆ వ్యక్తిని తిరిగి ఒక్క ఆట కూడా..

Hyderabad: పోలీసులపై జంతు ప్రేమికుడి బూతు పురాణం.. కండ కావరమంటూ నెటిజెన్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..?
Spot Visuals
Sravan Kumar B
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Aug 30, 2023 | 6:20 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 30: సిటిజన్స్‌కి పోలీసులు దగ్గర అవ్వాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత సినిమాల్లో మాదిరిగా పోలీస్‌లు తమ ప్రతాపాన్ని చూపించేందుకు అవకాశం లేకుండా పోయింది. అసలు పోలీసులు తమంతట తాముగా శిక్షించడానికి అవకాశం లేదు. కానీ ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణంగా శిక్షించడానికి కాదు కదా కనీసం గట్టిగా మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలకు కూడా పోలీసులపై నమ్మకం విశ్వాసం పెరిగింది. పోలీసులంటే తమన శిక్షించేవారు కాదని తమను రక్షించేవారు అనే అభిప్రాయం ఏర్పడింది. ఇదే కొన్ని సందర్భాల్లో తలనొప్పిగా మారింది. పోలీసులు దాడి చేశారనే సంఘటనల కన్నా ప్రజలే పోలీసులపై అనవసరంగా తమ ప్రతాపం చూపిస్తున్న సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. దీనివల్ల అనేక సందర్భాల్లో పోలీసులు ఇబ్బంది పడ్డ సిచువేషన్స్ ఉన్నాయి.

ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. అనవసరంగా పోలీసులపై బూతు పురాణం మొదలెట్టాడు ప్రణయ్ అనే వ్యక్తి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పాట్రోలింగ్ కార్ నెంబర్ 2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్న టైంలో ప్రణయ్ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు. ఉన్నట్టుండీ తన నోటికి పని చెప్పిన ప్రణయ్ చెప్పరాని మాటలతో పోలీసులను దూషించాడు. దీంతో చుట్టుపక్కల వారంతా నోరేళ్ళ బెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళ పోలీసులు ఆ వ్యక్తిని తిరిగి ఒక్క ఆట కూడా అనలేని పరిస్థితి. పోలీసులు ప్రణయ్ ని ఇబ్బంది పెట్టారని అనుకున్నారు ఇదంతా చూస్తున్న వారు. ఈ సంఘటన మొత్తాన్ని కూడా అక్కడున్న ఓ వ్యక్తి మొబైల్ లో రికార్డ్ చేసి మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆఖరికి జరిగిన విషయం తెలుసుకొని సదరు సిటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏంటంటే ఆగస్టు 30న ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రణయ్ తన రెండు పెపుడు కుక్కలతో రోడ్డుపై వెళుతుండగా ప్రణయ్ పక్క నుంచి వెళ్ళింది పోలీస్ కార్. దీంతో ప్రణయ్‌కి కోపం వచ్చిన పెపుడు కుక్కలనే చేంపేస్తావా అంటూ బూతులతో పోలీసులు తిట్టడం మొదలెట్టాడు. పోలీసులు ప్రణయ్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన అతని కోపం ఆగలేదు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూనే ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి పై అధికారులకు వివరించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని స్టేషన్ కి పిలిపించారు. ఏం జరిగిందని విషయం ఆరా తీయగా తాను ఒక జంతు ప్రేమికుడునని తన కుక్కల మీదికి పోలీసు వాహనం వస్తుందేమో అనుకొని నోరు జారానని ఒప్పుకున్నాడు. మొదట పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు పలు సెక్షన్ల కింద చేసిన బుక్ చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..