Hyderabad: పిల్లిని కాపాడిన పోలీసన్న.. నెటిజన్ల ప్రశంసలు..

Hyderabad: పిల్లిని కాపాడిన పోలీసన్న.. నెటిజన్ల ప్రశంసలు..

Lakshmi Praneetha Perugu

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 30, 2023 | 4:12 PM

ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో కారిడార్ నిర్మాణం కోసం.. పిల్లర్స్ వేసేందుకు ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు.  ఆ చువ్వల పైకి ఎక్కిన పిల్లి అక్కడ ఇరుక్కుపోయింది. కిందకు రాలేక మూడు రోజుల నుండి ఆ ఇనుప కడ్డీల పైనే ఉండిపోయి విలవిలలాడిపోయింది. అయితే ఆ మార్గం వెళ్తున్న స్కూల్ పిల్లలు కొంత మంది పిల్లి అవస్థను గమనించారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్ళి పిల్లిని కాపాడాలని విన్నవించుకున్నారు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చూసేసరికి భారీ ఎత్తున ఉన్న ఇనుప కడ్డీలపై పిల్లి కిందకి ఎలా రావాలో తెలియక తల్లడిల్లి పోతున్న దృశ్యం కనిపించింది.

పోలీసులు కేవలం ప్రజల కోసమే కాదు… మూగజీవుల కోసం కూడా. ఈ మాటను నిజం చేశారు తెలంగాణ పోలీసులు..ఉప్పల్ లో ఒక కానిస్టేబుల్ చేసిన సాహసం గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు… సాధారణంగా రోడ్డుపై మనుషుల ప్రాణాలు పోతుంటేనే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రోజులి ఇవి…అలాంటిది ఒక మూగ జీవి కోసం ఏకంగా తన ప్రాణన్ని లేక్క చేయలేదు కానిస్టేబుల్. ఆ జీవి బాధను చూసి చెల్లించి పోయాడు. ఎలా అయినా సరే కాపాడాలని నిర్ణయించుకొని భారీ సాహసం చేశాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో కారిడార్ నిర్మాణం కోసం.. పిల్లర్స్ వేసేందుకు ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు.  ఆ చువ్వల పైకి ఎక్కిన పిల్లి అక్కడ ఇరుక్కుపోయింది. కిందకు రాలేక మూడు రోజుల నుండి ఆ ఇనుప కడ్డీల పైనే ఉండిపోయి విలవిలలాడిపోయింది. అయితే ఆ మార్గం వెళ్తున్న స్కూల్ పిల్లలు కొంత మంది పిల్లి అవస్థను గమనించారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్ళి పిల్లిని కాపాడాలని విన్నవించుకున్నారు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చూసేసరికి భారీ ఎత్తున ఉన్న ఇనుప కడ్డీలపై పిల్లి కిందకి ఎలా రావాలో తెలియక తల్లడిల్లి పోతున్న దృశ్యం కనిపించింది.

ఒక్క సెకండ్‌ కూడా ఏమీ ఆలోచించకుండా తనతో పాటు ఒక చిన్న బ్యాగ్ ఒకటి తీసుకెళ్లి ఇనుప స్టాండ్ ఎక్కేసాడు కానిస్టేబుల్ పాండు.. కిందికి దిగే క్రమంలో పిల్లిని పట్టుకొని దిగడం కాస్త కష్టం అవుతుందనే ఉద్దేశంతో బ్యాగ్ ను తీసుకెళ్లాడు.. ఇనుప కడ్డీలపైకి ఎక్కిన కానిస్టేబుల్‌ను చూడగానే పిల్లి కాస్త భయపడింది. కొంచెం ముందుకు వెళ్ళింది. పిల్లి వెనకాలే వెళ్లిన కానిస్టేబుల్ తనతో తెచ్చుకున్న బ్యాగ్ ద్వారా పిల్లిని సేఫ్‌గా దించాడు. పక్కనే ఉన్న చిన్న గుడిసె వద్ద ఆ పిల్లిని వదిలేశాడు. ఐతే ట్రాఫిక్ పోలీస్ పిల్లిని కాపాడుతున్న సందర్భంలో మరో యువకుడు ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాడు. పిల్లిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన కానిస్టేబుల్ పాండును అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Aug 30, 2023 04:10 PM