Asia Cup 2023: సచిన్ ‌రికార్డు కోసం రోహిత్, కోహ్లీ పోటాపోటీ.. అలా చేసినవారిదే ‘అగ్రస్థానం’..

Asia Cup 2023: ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలిన భారత జట్టు పూర్తిగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే ఎన్‌సీఏలో యోయో టెస్ట్, ఫిటె‌నెస్ ప్రాక్టీస్ జరిగాయి. అలాగే జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఇది తొలి టోర్నీ కూడా కావడంతో తమ సత్తా ఏమిటో చూపించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం సచిన్ టెండూల్కర్ రికార్డ్‌పై దృష్టిపెట్టారు. సెప్టెంబర్ 2న పాకిస్థాన్, సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో పరుగుల వర్షం కురిపించి సచిన్ రికార్డ్‌ని తమ..

Asia Cup 2023: సచిన్ ‌రికార్డు కోసం రోహిత్, కోహ్లీ పోటాపోటీ.. అలా చేసినవారిదే ‘అగ్రస్థానం’..
Rohit Sharma And Virat Kohli; Sachin Tendulkar
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 28, 2023 | 6:29 PM

Asia Cup 2023: పాకిస్థాన్-శ్రీలంక సంయుక్త వేదికగా జరిగే ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు రోజులే సమయంలో ఉంది. ఆగస్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ మైదానంలో పాకిస్తాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్‌‌ జరగనుంది. అలాగే సెప్టెంబర్ 2న భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలిన భారత జట్టు పూర్తిగా సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే ఎన్‌సీఏలో యోయో టెస్ట్, ఫిటె‌నెస్ ప్రాక్టీస్ జరిగాయి. అలాగే జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఇది తొలి టోర్నీ కూడా కావడంతో తమ సత్తా ఏమిటో చూపించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం సచిన్ టెండూల్కర్ రికార్డ్‌పై దృష్టిపెట్టారు. సెప్టెంబర్ 2న పాకిస్థాన్, సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో పరుగుల వర్షం కురిపించి సచిన్ రికార్డ్‌ని తమ సొంతం చేసుకోవాలని పోటీపడుతున్నారు. ఇంతకీ సచిన్ పేరిట ఉన్న ఆ పరుగుల రికార్డ్ ఏమిటంటే..?

1984 నుంచి జరుగుతున్న ఆసియా కప్ టోర్నమెంట్ ఎక్కువగా వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు 15 ఎడిషన్లు జరగ్గా అందులో రెండు సార్లు టీ20 ఫార్మాట్‌లో, 13 సార్లు వన్డే ఫార్మాట్‌లో టోర్నమెంట్‌ని నిర్వహించారు. అయితే ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో 23 వన్డేలు ఆడిన సచిన్ 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో మొత్తం 971 పరుగులు చేశాడు. సచిన్ తర్వాత రోహిత్ శర్మ 1 సెంచరీ, 6 అర్థ సెంచరీలతో 745 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ 22 వన్డేలు ఆడాడు. అలాగే 19 వన్డేలు ఆడిన ధోని 648 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్(183) చేసిన విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

టాప్ యాక్టీవ్ ప్లేయర్లు..

వన్డే + టీ20 పరుగులు.. 

రోహిత్ సేన

మిస్టర్ 183

అంటే.. సచిన్ పేరిట ఉన్న ఆసియా కప్ పరుగుల రికార్డ్‌‌ని సొంతం చేసుకోవడానికి రోహిత్ 226, అలాగే కోహ్లీ 358 పరుగులు చేయాలి. మూడో స్థానంలో ధోని ఉన్నప్పటికీ అతను రిటైర్ అయిపోయాడు కనుక పోటీలో మహీ లేడు. ఇక గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు, సూపర్ ఫోర్ రౌండ్‌లో 3 మ్యాచ్‌లు(అంచనా), ఫైనల్ మ్యాచ్(అంచనా).. ఇలా ఆసియా కప్‌లో భారత్ మొత్తం 6 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీకి సచిన్ రికార్డ్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.