IND vs PAK: ‘క్రికెటర్లందరికీ కోహ్లీ రోల్ మోడల్..’ రన్ మెషిన్‌పై బాబర్ జాన్ జిగిరీ దోస్త్ ప్రశంసల జల్లు.. ఇంకా ఏమన్నాడంటే..?
Virat Kohli: పాక్ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీ కంటే తమ బాబర్ గొప్ప అంటూ ఎప్పడూ నెట్టింట హడావిడి చేస్తుంటారు. అయితే ఎప్పుడూ బాబర్ అజామ్ వెన్నంటే ఉండే ఓ స్టార్ ప్లేయర్ ఆ లెక్కలు చెల్లవన్నట్లుగా విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఆటీట్యూడ్ తనకు చాలా నచ్చుతుందని, ఆటలో ఎప్పుడూ వెనకడుగు వేయడని, అతనే క్రికెటర్లందరికీ రోల్ మోడల్ అంటూ ఆ స్టార్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతనెవరో తెలుసా..? రెండు రోజుల క్రితం ముగిసిన ఆఫ్ఘానిస్తాన్-పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 165 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా..
పాకిస్థాన్ తరఫున ఇటీవలి కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మ్యాన్‌గా బాబర్ అజామ్ పేరు పొందాడు. ఈ కారణంగానే చాలా మంది పాక్ మాజీలు విరాట్ కోహ్లీ కంటే తమ బాబర్ ఉత్తమ ప్లేయర్ అని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లీ కంటే తమ బాబర్ గొప్ప అంటూ ఎప్పడూ నెట్టింట హడావిడి చేస్తుంటారు. అయితే ఎప్పుడూ బాబర్ అజామ్ వెన్నంటే ఉండే ఓ స్టార్ ప్లేయర్ ఆ లెక్కలు చెల్లవన్నట్లుగా విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఆటీట్యూడ్ తనకు చాలా నచ్చుతుందని, ఆటలో ఎప్పుడూ వెనకడుగు వేయడని, అతనే క్రికెటర్లందరికీ రోల్ మోడల్ అంటూ ఆ స్టార్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతనెవరో తెలుసా..? రెండు రోజుల క్రితం ముగిసిన ఆఫ్ఘానిస్తాన్-పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 165 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఇమామ్ ఉల్ హక్. అవును, నమ్మశక్యం కాకున్నా అతని మాటలు నిజం. ఇంకా అతను చెప్పిన మాటలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డానియాల్ షేక్ యూట్యూబ్ షోలో ఇమామ్ మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీ క్రికెటర్లందరికీ రోల్ మోడల్. ఫిట్‌నెస్, పెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్, బ్రాండ్ వైజ్ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రస్తుత క్రికెటర్లకు సరైన ఉదాహరణ కోహ్లీ. నాకు కోహ్లీ ఆటీట్యూడ్ అంటే చాలా ఇష్టం. అతనిది ఫైటింగ్ యాటిట్యూడ్. అస్టేలియా జట్టును ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ జట్టును ఇంగ్లాండ్‌లో ఓడించడమే కాక.. వారి గడ్డపైనే వారిని స్లెడ్జింగ్ చేయడం అతనికే సొంతం. పరిస్థితులను సవాల్ చేస్తూ ‘నేను ఇక్కడ గెలవడానికే ఉన్నా’ అనే ఆటిట్యూడ్ తనది’ అంటూ పాక్ అభిమానుల గుండెల్లో బాంబ్ పేలేలా కోహ్లీని ప్రశంసించాడు. నిజానికి కోహ్లీని ప్రశంసిన తొలి పాకిస్తాన్ ప్లేయర్ అతను కాదు, అతని కంటే ఎందరో ప్లేయర్లు విరాట్‌ని పొగిడారు. కానీ తమ రోల్ మోడల్ అంటూ ఇమామ్ చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు, ముఖ్యంగా ఆసియా కప్ టోర్నీకి ముందు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
రోల్ మోడల్..
Pakistan opener Imam-ul-Haq heaps high praise on Virat Kohli and names him as his role model. pic.twitter.com/r6xuSDpisS
— CricTracker (@Cricketracker) August 27, 2023
ఎక్కడా తగ్గేదేలే..
Imam Ul Haq said – “I love Virat Kohli’s attitude. His fighting attitude, His never give up attitude, beating Australia in Australia and England in England and sledging them in their backyard. He always ready for any challenge and his attitude I’m here to win only”. pic.twitter.com/YnhkyaKFC9
— CricketMAN2 (@ImTanujSingh) August 25, 2023
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇమామ్..
Imam ul Haq receives the player of the series award #PakistanCricket #PakvsAfg2023 pic.twitter.com/HvAt6Bf6Qd
— Cricket Pakistan (@cricketpakcompk) August 26, 2023
2020 టీ20 వరల్డ్ కప్..
Virat Kohli at his best – that six Haris Rauf was special one❤️#ViratKohli𓃵 #INDvsPAK
— Lakshminarayana (@LnMedikonda) August 18, 2023
పాక్ అంటే పూనకాలే..
OTD Virat Kohli played this authorative wristy pull shot over mid on , and made greatest comeback in history of cricket 🐐pic.twitter.com/gT9N8xZS6Z
— Saurav (@saurav_viratian) August 28, 2023
ఇదిలా ఉండగా.. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్, శ్రీలంక పాల్గొనుండగా.. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా ఒక విధంగా విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ మధ్య జరిగే పోటీ అని చెప్పుకోవచ్చు. భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అయినప్పటికీ మెయిన్ అట్రాక్షన్ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అలాగే అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.
ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసీద్ధ్ కృష్ణ.
స్టాండ్ బై ప్లేయర్: సంజు శాంసన్.
ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్(కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ హరీస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్