- Telugu News Photo Gallery Snake bite to boy 9 times just in 2 months in Kalaburagi District, Karnataka
2 నెలల్లో 9 సార్లు కాటు.. ఊరు వదిలెళ్లినా బాలుడిని వెంటాడుతోన్న పాము.. అసలేం జరిగిందంటే..?
Prajwal vs Snake: చాలా మంది పామును చూసిన భయంలో దానిపై రాళ్లు, కర్రలు విసురుతుంటారు. ఇలా జరిగిన తర్వాత మళ్లీ ఏదైనా పాము కనిపిస్తే.. లేదా పదే పదే పాములు కనిపిస్తే ఏదైనా పాము పగ పట్టిందని పెద్దలు చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు కానీ తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ అనే విద్యార్థిని మాత్రం ఓ పాము వెంటాడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము ప్రజ్వల్‌ని రెండు నెలల వ్యవధిలోనే 9 సార్లు కాటేసింది. దీంతో ప్రజ్వల్ తల్లిదండ్రులు తమ కొడుకు పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
Updated on: Aug 29, 2023 | 7:23 PM

Prajwal vs Snake: పాము పగ పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు నిజం కాదని వాదించేవారు కూడా లేకపోలేదు. అయితే ప్రజ్వల్ అనే కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల విద్యార్థిని ఓ పాము వెంటాడుతోంది. ప్రజ్వల్‌ని రెండు నెలల్లోనే 9 సార్లు కాటేసి, అతని తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అవును, కలబురగి జిల్లా చిత్తపురా తాలూకాలోని హలకట్టి గ్రామానికి చెందిన ప్రజ్వల్ 9వ తరగతి చదువుతున్నాడు. వయసు 14 ఏళ్లే కానీ 9 సార్లు పాము కాటు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రజ్వల్ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిపై అప్రమత్తంగా ఉండడం వల్ల పాము కాటు వేసిన ప్రతిసారి కాపాడుకోగలుగుతున్నారు.

తమ కొడుకును పదే పదే ఒకే పాము కాటు వేయడంలో ఏమైనా నాగదోషం ఉందేమో అనే సందేహంలో ఎన్నో పూజలు కూడా చేశారు ప్రజ్వల్ తల్లిదండ్రులు. ఇంకా కుల దైవం కోసం చిన్న గుడి కూడా నిర్మించారు.

జులై 3న హలకర్తి గ్రామంలోని సొంత ఇంట్లో ప్రజ్వల్‌ని తొలిసారిగా పాము కాటేసింది. ఇలా పదే పదే జరగడంతో అతని కుటుంబం హలకర్తి గ్రామాన్ని వదిలి, చిత్తాపూర్ తాలూకా వాడిలో స్థిరపడింది.

అందరికీ షాక్ కలిగించే విషయం ఏమిటంటే.. ప్రజ్వల్‌ని కాటు వేసే పాము అతనికి తప్ప ఇతరులు ఎవరికీ కనిపించదు. అలా కాదు, పాము కాటు వేయకపోయినా ప్రజ్వల్ సరదాగా చెప్తున్నాడా అంటే అలా కూడా లేదని వైద్యులు చెబుతున్నారు.





























