Rain Alert: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. భారత్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమించాయని పేర్కొంది. ఈశాన్యరుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని తెలిపింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ఈరోజు ఉదయం ప్రవేశించాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. భారత్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమించాయని పేర్కొంది. ఈశాన్యరుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని తెలిపింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ఈరోజు ఉదయం ప్రవేశించాయి. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనూ మరియు దక్షిణ , మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు – ఈశాన్య గాలులు క్రింది ట్రోపోస్పిరిక్ ఎత్తులో పూర్తిగా వ్యాపించాయి. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.. గురువారం శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు ఐదు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మంతో పాటు.. మహబూబాబాద్ జిల్లాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
గురువారం(16 అక్టోబర్ 2025)న నైరుతి రుతుపవనాలు దేశం నుండి పూర్తిగా నిష్క్రమించాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దేశంలో మే 24న రుతుపవనాలు ప్రవేశించాయని,ఆంధ్రప్రదేశ్ లో మే 26న రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. గురువారం ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




