Head Constable Jobs 2025: ఇంటర్ అర్హతతో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తుల లింక్ ఇదే
Delhi Police Head Constable Ministerial Recruitment 2025: హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో పురుష అభ్యర్ధులకు 341 పోస్టులు, మహిళ అభ్యర్ధులకు

ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో పురుష అభ్యర్ధులకు 341 పోస్టులు, మహిళ అభ్యర్ధులకు 168 పోస్టులు కేటాయించారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు ఎంపికైనవారు దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు జులై 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా గరిష్ఠ వయసులో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల చొప్పున వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, శారీరక ప్రమాణాలు, పీఈటీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి లెవెల్ 4 కింద నెలకు రూ.25,500 ప్రారంభ వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం రూ.అర లక్షకు పైగా అందుకోవచ్చు. అనుభవం, అర్హతలు, అంతర్గత పరీక్షలు తదితరాల ఆధారంగా ప్రమోషన్లు పొందొచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబరు, 2025 లేదా జనవరి 2026లో ఉంటాయి.
ఎంపిక విధానం ఇలా..
తొలుత రాత పరీక్ష ఉంటుంది. ఇది 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్‌మెటిక్ స్కిల్) 20 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) 25 ప్రశ్నలు, కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి 10 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. అర్హత మార్కులు పొందిన వారికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) అండ్ మెజర్‌మెంట్ టెస్టులకు ఎంపిక చేస్తారు
పీఈటీ టెస్ట్‌లో పురుష అభ్యర్ధులు 1600 మీటర్ల పరుగును 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. మూడు ప్రయత్నాల్లో ఒకసారైనా లాంగ్‌జంప్‌లో 12 1/2 అడుగులు, హైజంప్ 3 1/2 అడుగులు చేయాలి. ఎత్తు 165 సెం.మీ, ఛాతీ విస్తీర్ణం 78 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చినపుడు కనీసం 4 సెం.మీ. పెరగాలి. ఇక పీఈటీ టెస్ట్‌లో మహిళ అభ్యర్ధులకు 800 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. మూడు ప్రయత్నాల్లో ఒకసారైనా లాంగ్‌జంప్‌లో 9 అడుగులు, హైజంప్‌లో 3 అడుగులు దాటాలి. ఎత్తు 157 సెం.మీ. తప్పనిసరిగా ఉండాలి. అనంతరం పీఈ, ఎంటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. చిరరిగా సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




