AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!

వివాహం జరిగి నెల రోజులు గడవకముందే హుస్సేన్ సాగర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కోడలు, ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి, తల్లి, స్నేహితులు ఆరోపించారు..

Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
Newlywed Man Committed Suicide
Peddaprolu Jyothi
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 08, 2025 | 11:08 AM

Share

హైదరాబాద్‌, జులై 8: భార్య వేదింపులకు మరో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం జరిగి నెల రోజులు గడవకముందే హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కోడలు, ఆమె తరపు బంధువుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరి, తల్లి, స్నేహితులు ఆరోపించారు. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి సంతోష్ సోదరి భారతి, తల్లి మంగమ్మ, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతుడి సంతోష్ సోదరి భారతి మాట్లాడుతూ.. నా తమ్ముడు సంతోష్ భార్య ఆమె తరపు బంధువులు వేధింపులు పెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల మే 9న రామంతపూర్ కు చెందిన శారదతో వివాహం చేశాము. శారదకు గైనిక్ సమస్యలు ఉన్న విషయం మాకు చెప్పకుండా పెళ్లి చేశారు. మా ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనిపించింది. ఆమెకు సమస్యలు ఉన్నట్లు తమకు ఎందుకు చెప్పలేదని శారదను ఆమె కుటుంబ సభ్యులను నిలదీశాం. అప్పటినుండి నా తమ్ముడు సంతోష్‌కు శారద, ఆమె మేనమామలు, తల్లి, తమ్ముడు బెదిరింపులు స్టార్ట్ చేశారు. నువ్వే పెళ్లి చేసుకున్నావ్. కాబట్టి నీదే భారం అని నా తమ్ముడిని మానసికంగా వేదించారు. దీంతో జులై 4న శారద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరసటి రోజు నా తమ్ముడు సంతోష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

మేము నాచారం పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. మరసటి రోజు హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు లేక్ పోలీసులు తెలిపారు. అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా నా తమ్ముడిని వేధించారు. వాటికి సంబంధించిన ఆడియోలు హాస్పిటల్ రిపోర్టులు మా వద్ద ఉన్నాయి. సమస్య ఉందని తెలిసినా.. ఎందుకు పెళ్లి చేశారని శారద వాళ్ళ తల్లిని అడుగుతున్న ఆడియో కూడా మా వద్ద ఉంది. శారదని మా దగ్గర ఉంచుకోకపోతే కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామని వాళ్లు బెదిరించారు. నా తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన శారదాను ఆమె కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి సంతోష్ సోదరి భారతి, తల్లి మంగమ్మ, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..