AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Schools: కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు వచ్చేస్తున్నాయ్..! ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్నచోట ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో ఈ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 571 పాఠశాలలు ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..

Govt Schools: కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు వచ్చేస్తున్నాయ్..! ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
New Government Schools
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 08, 2025 | 12:07 PM

Share

హైదరాబాద్, జులై 8: తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ నగరాల్లోని బస్తీల్లో కనీసం 20 మంది విద్యార్థులు ఉన్న ఏరియాల్లో సర్కారు బడులు లేని చోట ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 571 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 157 స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 63 గ్రామీణ ప్రాంతాలు 94 పట్టణ నగర ప్రాంతాల్లో ఈ 157 ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల ఏర్పాటుకు కావలసిన సౌకర్యాలు ఫర్నిచర్ సిబ్బంది బడ్జెట్ వంటివి ఆయా జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు సమకూర్చుకోవాలంటూ విద్యాశాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు.

మొత్తం 571 స్కూల్స్ త్వరలో ఏర్పాటు

రాష్ట్రంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీసం 20 మంది విద్యార్థులు ఉండి ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలను గుర్తించి అధికారులు పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం 212 గ్రామీణ, 359 పట్టణ ప్రాంతాల కాలనీలు గుర్తించింది. ఈ ఏరియాల్లో 571 పాఠశాలలను నెలకొల్పుతామని ఇప్పటికే ప్రకటించింది. తొలిదశలో 157 పాఠశాలలను ప్రారంభిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.