- Telugu News Photo Gallery Andhra Pradesh Handloom and Textile Department Notification issued for filling vacancies in Gunture
AP Govt Jobs 2025: ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఈ కింద తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2025 | 11:53 AM

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది.

ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్‌లో 5 ఖాళీలు, టెక్స్ టైల్ డిజైనర్స్‌లో 5 ఖాళీల భర్తీకీ ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్ కు దరఖాస్తుదారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ (DHT) లేదా టెక్స్ టైల్ టెక్నాలజీ నందు డిగ్రీ డిప్లొమాతో పాటు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుంది.

అలాగే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, MS Word / Excel / పవర్ పాయింట్, రికార్డులు, ఖాతా పుస్తకాల నిర్వహణలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. టెక్స్ టైల్ డిజైనర్ పోస్ట్ కు డిజైన్లు రూపొందించే నైపుణ్యం కలిగి నిఫ్ట్ ఎన్ఐడీ లేదా ఏదైనా ప్రఖ్యాత సంస్థ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే కనీసం చేనేత విభాగంలో 2 సంవత్సరాలు టెక్స్ టైల్ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అర్హత, అనుభవం, వయస్సు, నివాసం మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుదారులు తమ ధృవపత్రాల కాపీలతో పాటు బయోడేటాను ప్రకటన వెలువడిన రోజు నుంచి 21 రోజులలోపు కమిషనర్, జౌళీ చేనేత శాఖ, 4వ అంతస్తు, కార్పొరేట్ బిల్డింగ్, ఐహెచ్సీ ఆటోనగర్, మంగళగిరి-522503, గుంటూరు జిల్లా నందు ఇవ్వాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు http://www.handlooms.nic.in ను క్లిక్ చెయ్యండి.
