- Telugu News Photo Gallery Here are 10 amazing cruises in 2025 for a relaxing with kids on waterways.
Kid-Friendly Cruises: 2025లో 10 అద్భుతమైన క్రూయిజ్‌లు ఇవే.. పిల్లలతో హాయిగా జలవిహారం..
చాలామంది పిల్లతో హాయిగా గడపాలని ఉంటుంది. అలాంటివారు మీ కుటుంబంతో జలవిహారానికి వెళ్లడం బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. 2025లో కుటుంబంతో సరదాగా గడపడానికి అనువైన 10 ఉత్తమ క్రూయిజ్‌లు ఉన్నయి. ఈ క్రూయిజ్‌లు లైన్ల ప్రత్యేకతలు, సౌకర్యాలు, వినోద కార్యక్రమాల గురించి ఈరోజు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం రండి..
Updated on: Jul 08, 2025 | 11:46 AM

మొదట 'కార్నివల్ క్రూయిజ్ లైన్' సముద్రంలోనే ఉన్న మొట్టమొదటి రోలర్ కోస్టర్‌తో సహా అనేక ఉత్తేజకరమైన కార్యక్రమాలను అందిస్తుంది. పిల్లలకు అనుకూలమైన జాని క్రాఫ్ట్ స్టూడియో మరియు విశాలమైన క్యాబిన్లు కూడా ఉన్నాయి. రెండవది 'ఎంఎస్‌సి క్రూయిజ్‌లు' ఆధునిక టెక్నాలజీతో కూడిన టీమ్ ల్యాబ్‌లు, జిప్‌లైనింగ్ వంటి వినోదాలతో పిల్లలను ఆకట్టుకుంటాయి. బ్రిటీష్ ద్వీపాలకు ప్రయాణించేవారికి ప్రీమియం డ్రింక్స్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

'పి అండ్ ఒ క్రూయిజ్‌లు' ఈ జాబితాలో మూడవది అమెరికన్ టచ్‌తో కూడిన రెట్రో శైలి డైనింగ్, నాలుగు తెరల సినిమా, పిల్లల క్లబ్ మరియు అల్టిట్యూడ్ స్కై వాక్ వంటి ఆకర్షణలను అందిస్తాయి. 'సెలెబ్రిటీ క్రూయిజ్‌లు' ఉచిత పిల్లల క్లబ్‌లు, ఎక్స్‌బాక్స్ స్టేషన్లు, స్పోర్ట్స్ కోర్టులు, STEM-ఆధారిత కార్యక్రమాలను అందిస్తాయి.

'ప్రిన్సెస్ క్రూయిజ్‌లు' ప్రిన్సెస్ మెడాలియన్ క్లాస్‌తో అధునాతన టెక్నాలజీతో కూడిన సౌకర్యాలు మరియు ఇండోర్ ప్లానెటోరియంను అందిస్తాయి. 'హాలండ్ అమెరికా' 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. అలాస్కా వంటి ప్రదేశాలకు ఉత్తేజకరమైన ప్రయాణాలను ఏర్పాటు చేస్తుంది.

'రిట్జ్-కార్ల్టన్ యాచ్ కలెక్షన్' ప్రీమియం కుటుంబ క్రూయిజ్‌లను అత్యాధునిక సౌకర్యాలతో అందిస్తుంది. 'డిస్నీ క్రూయిజ్ లైన్' డిస్నీ థీమ్‌తో పూర్తిగా పిల్లలను ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా 4 నుండి 11 ఏళ్ల పిల్లలకు ఇది మంచి ఎంపిక.

'నార్వేజియన్ క్రూయిజ్ లైన్' పిల్లలకు ప్రత్యేకమైన మెనూ, వాటర్ పార్క్‌లు మరియు సాహస కార్యక్రమాలను అందిస్తుంది. చివరగా, 'రాయల్ కెరేబియన్' రాక్ క్లైంబింగ్, జిప్ లైన్, ఐస్ స్కేటింగ్ రింక్ మరియు ఇతర అనేక సాహస కార్యక్రమాలను అంది




