- Telugu News Photo Gallery Spiritual photos If you perform puja like this in Ashada Masam, you will soon be blessed with good luck.
Ashada Masam Pooja: ఆషాడ మాసంలో ఇలా పూజ చెయ్యండి చాలు.. అదృష్టం మీ వెంటనే..
ఆషాఢమాసంలో శుభకార్యాలు నివారించి ఉగ్ర దేవతలైన దుర్గాదేవి, కాళికామ్మ, కాళభైరవులను పూజించడం ద్వారా జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చు. వీరికి పూజలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చని పీడితులు తెలిపారు. మరి ఈ మాసంలో ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.? ఈరోజు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2025 | 12:20 PM

ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్‌లోని ఒక ముఖ్యమైన మాసం. ఈ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదు అని నమ్ముతారు. అయితే, ఈ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానాలు చేయడం ద్వారా అదృష్టం, ఆరోగ్యం, శుభాలను పొందవచ్చని భక్తులు నమ్ముతారు.

ఉగ్ర దేవతలైన దుర్గాదేవి, కాళికామ్మ, మహిషాసురమర్ధిని, కాళభైరవులను ఆషాఢ మాసంలో పూజించడం చాలా శుభప్రదమని పండితులు తెలిపారు. ఈ దేవతల పూజ జాతకంలోని పాప గ్రహ దోషాలను తొలగించి, గ్రహాల అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది.

దుర్గాదేవి ఆలయంలో మంగళవారాలు, శుక్రవారాల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం, కాళికామ్మకు నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల శత్రు బాధలు, నరదృష్టి నుండి రక్షణ లభిస్తుంది. కాళభైరవుడిని దర్శించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు.

Umbrella

గ్రామ దేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయడం, పసుపు బొట్లు అలంకరించి నిమ్మకాయల దండ సమర్పించడం, పెరుగన్న నైవేద్యం సమర్పించడం ద్వారా ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, వారాహి అమ్మవారిని పూజించడం, వారాహి కందదీపం వెలిగించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని వివరించారు. సంక్షిప్తంగా, ఆషాఢమాసంలో ఈ పూజలు, దానాలు చేయడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు.




