AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dosha Nivarana Temples: మీకు శని దోషం ఉందా.? ఈ ఆలయాల్లో నివారణ పూజలు..

భారతదేశం అంతటా అనేక దేవాలయాలు శని దోష నివారణ (శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడం)లో వాటి ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఈ దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక ఆచారాలు ఆచరిస్తారు/ ప్రార్థనలు చేస్తారు. శని ప్రభావనికి సంబంధించన పూజలు  నిర్వహించి దోషన్నీ  తగ్గించడానికి  ప్రయత్నిస్తారు. వాటిలో 5 దేవాలయాలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Jul 08, 2025 | 12:58 PM

Share
శని శింగనాపూర్, మహారాష్ట్ర: ఈ ఆలయం బహిరంగ ప్రదేశంలో శని దేవుడిని నల్ల రాయిగా పూజిస్తారు. ఇక్కడ దేవతకు నూనె సమర్పించడం వల్ల శనిని శాంతింపజేయడానికి, శని దోషం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుందని భక్తులు నమ్ముతారు.

1 / 5
తిరునల్లార్ దర్బరణ్యేశ్వరర్ ఆలయం, తమిళనాడు: కుంభకోణం సమీపంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. అంతేకాకుండా ఇది శని దేవుడిని పూజించడానికి కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం. శని దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి భక్తులు ఆచారాలు చేసే ముందు నల తీర్థంలో శుద్ధి స్నానం చేస్తారు.

2 / 5
కోకిలవన్ ధామ్, ఉత్తరప్రదేశ్: ఈ ఆలయం శ్రీకృష్ణుడు శనిదేవుడికి దర్శనం ఇచ్చిన ప్రదేశంగా నమ్ముతారు. ముఖ్యంగా సాడే సాతి సమయంలో శని ఆశీస్సులు కోరుకునేవారికి ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. ఇక్కడ పూజలు చేస్తే శని దోషం తగ్గుతుంది. 

3 / 5
మందపల్లి, ఆంధ్రప్రదేశ్: రాక్షసులను చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శని దేవుడు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ఈ ఆలయంలో కథ ఉంది. శనిగ్రహ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు ఇక్కడికి వస్తారు.

4 / 5
బన్నంజే శ్రీ శని క్షేత్రం, కర్ణాటక: ఉడిపిలోని ఈ ఆలయంలో 23 అడుగుల పెద్ద శని విగ్రహం ఉంది. దీని భక్తులు నూనెతో అభిషేకం చేస్తారు. దీనివల్ల శని దోషం పొందుతుందని నమ్ముతారు. శని ఆశీస్సులు కోరుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. 

5 / 5