- Telugu News Photo Gallery Spiritual photos Samudrik Shastra : these type of feet of women lucky for their in laws and husband
Samudrik Shastra: స్త్రీల పాదాలు ఇలా ఉన్నాయా..అత్తారింటికి లక్ష్మీదేవి.. అడుగు పెట్టిన చోట ధనధాన్యానికి లోటు ఉండదట
జ్యోతిష్య శాస్త్రం వలె వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే శాస్త్రం సాముద్రిక శాస్త్రం. ఇది కూడా అత్యంత ప్రాచీన శాస్త్రం. దీనిలో మనిషి ముఖం, శరీరం, చేతులు, కాళ్లు, ఆకరాలను బట్టి వ్యక్తి వ్యక్తిత్వం, లక్షణాలు, భవిష్యత్తును అంచనా వేస్తారు. ఈ నేపధ్యంలో స్త్రీల పాదాల గురించి కూడా సాముద్రిక శాస్త్రం ప్రస్తావించింది. కొన్ని రకాల పాదాలున్న స్త్రీలపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అటువంటి స్త్రీలను అత్తమామలు పాలిస్తారు.
Updated on: Jul 08, 2025 | 5:07 PM

సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీర భాగాల నిర్మాణం, పరిమాణం ఆధారంగా అంచనాలు వేయబడతాయి. సాముద్రిక శాస్త్రం సాముద్రిక ఋషిచే సృష్టించబడింది. అందుకే దీనిని సాముద్రిక శాస్త్రం అని పిలుస్తారు.

సాముద్రిక శాస్త్రంలో చిన్న, పెద్ద, మందపాటి, పొడవైన, వెడల్పు గల పాదాలు గురించి విభిన్న నమ్మకాలు ఉన్నాయి. పాదాలు ఉన్న తీరుని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. భర్తకి , అత్తమామలకు అదృష్టవంతులైన స్త్రీలు ఎవరు? ఎటువంటి పాదాలున్న స్త్రీలకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి తెలుసుకుందాం..

జీవితంలో భౌతిక ఆనందం లభిస్తుంది: పాదాలు చాలా మృదువుగా ఉంటే.. ఇటువంటి పాదాలున్న స్త్రీలు జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి స్త్రీలపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరు తమ భర్తలతో భుజం భుజం కలిపి నడుస్తారు. ఈ అమ్మాయిలు దూరదృష్టి గలవారు కూడా. ఈ అమ్మాయిలు సంతోషంగా ఉంటారు. తమతో ఉన్నవారిని సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలాంటి స్త్రీలు తమ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు.

భర్త అదృష్టవంతుడు: సాముద్రిక శాస్త్రం ప్రకారం మృదువుగా మరియు ఒకదానికొకటి అనుసంధానించబడిన వేళ్లు ఉన్న స్త్రీలు తమ భర్తలను, అత్తమామలను పరిపాలిస్తారు. ఇటువంటి పాదాలున్న స్త్రీల జీవితంలో డబ్బుకు కొరత ఉండదు.

ఇలాంటి స్త్రీలు తమ జీవిత భాగస్వామికి లక్ష్మీ అవతారం. వివాహం తర్వాత ఈ స్త్రీలు ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా.. ఆ ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉండదు. ఈ స్త్రీలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు. ఈ స్వభావం కారణంగా ఇటువంటి పాదాలున్న స్త్రీలు వివాహం తర్వాత కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాదు వీరిని అత్తమామలు తమ అదృష్టవంతురాలిగా భావిస్తారు.

ధనవంతుడైన జీవిత భాగస్వామిని పొందుతారు: సాముద్రిక శాస్త్రం ప్రకారం పాదాలపై శంఖం, కమలం, జెండా లేదా చేప గుర్తులు ఉన్న స్త్రీలకు ధనవంతుడైన జీవిత భాగస్వామి లభిస్తారు. అంతేకాకుండా వీరి భర్తలు శ్రద్ధగలవారు,విశ్వాసపాత్రులు. ఇటువంటి స్త్రీలు జీవితంలో చాలా కీర్తిని పొందుతారు. వీరికి అత్తమామల నుంచి మాత్రమే కాదు సమాజం నుంచి కూడా చాలా గౌరవం లభిస్తుంది. వీరి జీవితంలో దేనికి కొరత ఉండదు.




