AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరవాసులారా ఊపిరి పీల్చుకోండి.. పూర్తయిన పికెట్‌ నాలా పనులు, శుక్రవారం నుంచే అందుబాటులోకి..

సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. గడిచిన ఆరు నెలల నుంచి కొనసాగుతోన్న పికెల్ నాలా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. దీంతో ఆరు నెలల నుంచి ట్రాఫిక్‌ కష్టాలు పడుతోన్న నగరవాసులకు..

Hyderabad: నగరవాసులారా ఊపిరి పీల్చుకోండి.. పూర్తయిన పికెట్‌ నాలా పనులు, శుక్రవారం నుంచే అందుబాటులోకి..
Hyderabad Picket Nala
Narender Vaitla
|

Updated on: Oct 27, 2022 | 4:34 PM

Share

సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. గడిచిన ఆరు నెలల నుంచి కొనసాగుతోన్న పికెల్ నాలా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. దీంతో ఆరు నెలల నుంచి ట్రాఫిక్‌ కష్టాలు పడుతోన్న నగరవాసులకు రిలీఫ్‌ లభించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (SNDP) ద్వారా వరద ముంపు నివారణకు చేపట్టిన పనులలో మొట్టమొదటి రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన పికెట్ నాలా పై బ్రిడ్జి పనులను చేపట్టారు. నాలా విస్తరణ పనులతో ఆరు నెలలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ డైవర్షన్ కు రేపటితో ఫుల్ స్టాప్ పడనుంది.

హైదరాబాద్‌లో చినుకు పడిందంటే చాలు నాలాలు ఉప్పొంగే పరిస్థితి ఉంది. వరదనీరు పెరగడం నాలాలు కుచించుకుపోవడం వల్ల నాలాల చుట్టు పక్కల ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా SNDP కార్యక్రమం ద్వారా నాలాల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే అత్యంత రద్దీ ప్రాంతమైన పికెట్‌ నాలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఇందులో భాగంగానే ఎస్‌పీ రోడ్డు కరాచీ బేకరీ వద్ద వంతెన పుననిర్మాణాన్ని చేప్టటారు. వర్షాకాలంలో బేగంపేట ప్రాంతలో చాలా కాలనీలు నీటి ముంపునకు గురయ్యేవి.

ఈ నాలా బ్రిడ్జి పనులు పూర్తి కావడం వల్ల సికింద్రాబాద్‌ కంటోన్నెంట్ బోర్డు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు తగ్గుతుంది. కంటోన్మెంట్‌ బోర్డ్‌లోని సుమారు 100 కాలనీలకు ప్రయోజనం జరగనుంది. ముఖ్యంగా అన్నా నగర్ బస్తీ, రసూల్‌పురా, BHEL కాలనీ, ICRISAT కాలనీ, సౌజన్య కాలనీ, బోయిన్ పల్లిలోని కొన్ని ప్రాంతాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. సుమారు 8000 గృహాలు కుటుంబాలు ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

నగరంలో తీరనున్న ముంపు సమస్యలు: మేయర్‌

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్ట కారణంగా నగరంలో రానున్న రోజుల్లో వరద ముంపు సమస్యలు పూర్తిగా తీరనున్నాయని మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి అన్నారు. ఎన్నో అవంతరాలు ఎదురైనా పికెట్‌ నాలా పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ ద్వారా చేపట్టిన నాలాల పునరుద్ధరణ పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయని తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..