Rajiv Swagruha Flats: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఎగబడుతోన్న జనాలు.. డిమాండ్ నేపథ్యంలో చివరి తేదీ పొడగింపు..
హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో హెచ్‌ఎమ్‌డీఏ నిర్మించిన ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల విక్రయాలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే ఫ్లాట్లు అందుబాటులో..

హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో హెచ్‌ఎమ్‌డీఏ నిర్మించిన ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల విక్రయాలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే ఫ్లాట్లు అందుబాటులో ఉండడంతో వీటిని విక్రయించడానికి జనాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా జూన్‌లో లాటరీ విధానాన్ని నిర్వహించి లబ్ధిదారులకు ఇప్పటికే ఫ్లాట్లను అందించారు.
ఇక మొదటి ఫేజ్‌లో మిగిలిపోయిన ఫ్లాట్లను రెండో ఫేస్‌లో భాగంగా అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ట్రిపుల్ బెడ్ ఫ్లాట్లకోసం రూ. 3 లక్షలు, డబుల్ బెడ్ ఫ్లాట్‌కోసం రూ. 2 లక్షలు, సింగిల్ బెడ్ రూమ్ కోసం రూ. 1 లక్ష టోకెన్ అమౌంట్‌ను స్వీకరిస్తున్నారు. సెకండ్ ఫేజ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుండడంతో డీడీల స్వీకరణకు చివరి తేదీని పొడగించారు. టోకెన్ అడ్వాన్స్ డీడీల స్వీకరణ గడువు 26-10-2022 కాగా ఇప్పుడు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పండుగల సెలవులు, ఇంకా కేవలం కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది నుంచి దరఖాస్తుల గడువును పెంచమని అభ్యర్థన వచ్చింది. ఈ నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే టోకెన్ అడ్వాన్స్ డీడీల స్వీకరణకు గడువును 02-11-2022కి పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..



