Saidabad Incident: మేమున్నాం మీకు.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ..
సైదాబాద్ రేప్ కేస్ వ్యవహారంలో స్పందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైదాబాద్ వెళ్లారు.
సైదాబాద్ రేప్ కేస్ వ్యవహారంలో స్పందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైదాబాద్ వెళ్లారు రూ . 20 లక్షల చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. నిందితుడ్ని పట్టుకొని శిక్షించడంతోపాటు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానకిి మంత్రలు హామీ ఇచ్చారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..