Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..

గుజ‌రాత్‌లో రేపు కొత్త మంత్రివ‌ర్గం కొలువుదీర‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం జ‌రుగ‌నుంది. గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్ వారిచేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు.

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో  కొత్త కేబినెట్‌..
Cm Bhupendra Patel
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2021 | 8:37 AM

గుజ‌రాత్‌లో రేపు కొత్త మంత్రివ‌ర్గం కొలువుదీర‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం జ‌రుగ‌నుంది. గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్ వారిచేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరుతోంది. ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌ కనబడేలా మొత్తం 27 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త కూర్పుతో పాత మంత్రుల్లో నిరుత్సాహం నెలకొందనే వార్తలు కమళదలంలో కలకలం రేపుతోంది. బుధవారం జరగాల్సిన ప్రమాణస్వీకారం.. పాత మంత్రుల అలకతో గురువారంకు వాయిదా పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే కొత్తవారి పేర్లను గోప్యంగా ఉంచినట్లు సమాచారం.

అయితే, గత ప్రభుత్వంలోని మెజారిటీ సభ్యులను 90 శాతం వరకూ తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొందరు మహిళా ఎమ్మెల్యేలతో సహా కొత్త ముఖాలకే మంత్రివర్గంలో ప్రధానంగా చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత మంత్రివర్గంలోని పలువురు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ఆయన నివాసంలో కలుసుకున్నట్టు రాజకీయ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి. కొందరు ఆశావహులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పటేల్ పిలిపించి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.

కాగా, విజయ్ రూపానీ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్‌కే కొత్త సీఎంగా పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు కూడా మొదట్లో వినిపించాయి. ఆ ఊహాగానాలకు భిన్నంగా భూపేంద్ర పటేల్ పేరును లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ క్రమంలో నితిన్ పటేల్‌ను కొత్త క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా అనే ఉత్సుకత పార్టీ వర్గాల్లో నెలకొంది. రూపానీ క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రులైన భూపేంద్రసిన్హ్, ఆర్‌సీ ఫల్డు, కౌశిక్ పటేల్‌ను మాత్రం కొత్త మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్