Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

ఎలాంటి క్రైమ్‌ జరిగినా.. పోలీసులు ముందు నమ్ముకునేది టెక్నాలజీనే. ఫోన్‌ నెంబర్‌ ట్రేస్‌ చేయడం.. సీసీటీవీల ద్వారా వాడిని గుర్తించి పట్టుకోవడం చేస్తున్నారు. కాని..

Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..
Crime Raju
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2021 | 7:37 AM

అన్నెంపున్నెం ఎరుగని ఐదారేడుల పసికూనలపై విరుచుకుపడుతున్నాయి పైశాచిక మూకలు. నగరం నడిబొడ్డున సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పాపాయిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచకుడి ఆచూకీ కోసం యావత్‌ సమాజం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది… అసలు పల్లం కొండ రాజు అనే అనకొండ ఎక్కడున్నాడు? పోలీసుల కళ్ళుగప్పి ఎలా తప్పించుకు తిరుగుతున్నాడు? ఇంత అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నా, పోలీసులకు పాతతరహాలో సెర్చింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాల్సిన పరిస్థితి. ఇంతకీ ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందా? అసలు హంతకుడు ఇక్కడే ఉన్నాడా? రాష్ట్రం వీడిపోయాడా? ఉంటే ఎక్కడున్నాడు? సమాధానం లేని ప్రశ్నలెన్నో ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి.

సింగరేణి కాలనీ రేప్‌ అండ్‌ మర్డర్‌ విషయంలో ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతోంది? పోలీసుల దర్యాప్తుకు సహకారం అందుతోందా? రేపిస్టును పట్టుకునేందుకు ఎలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారు పోలీసులు? రేప్‌ జరిగి ఇప్పటికే వారం రోజులు కావొస్తోంది. నిందితుడు ఇంకా దొరకలేదు. చిన్నారిని రేప్‌చేసి.. కిరాతకంగా మర్డర్‌ చేసేసి పారిపోయాడు.

ఎలాంటి క్రైమ్‌ జరిగినా.. పోలీసులు ముందు నమ్ముకునేది టెక్నాలజీనే. ఫోన్‌ నెంబర్‌ ట్రేస్‌ చేయడం.. సీసీటీవీల ద్వారా వాడిని గుర్తించి పట్టుకోవడం చేస్తున్నారు. కాని.. నిందితుడు ఫోన్‌ వాడకపోవడం పోలీసులకు పెద్దచిక్కే వచ్చిపడింది. ఈ కేసులో టెక్నాలజీ సగమే ఉపయోగపడుతోంది. మిగితాదంతా ఫీల్డ్‌ వర్క్‌ చేయాల్సిందే. హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఐపీఎస్‌ సజ్జనార్‌ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ రేపిస్టు ఒక ఆవారా కాబట్టి బస్టాండుల్లో, ఫుట్‌పాత్‌లపై పార్కులు ఇతర ప్రదేశాల్లో కనిపించే అవకాశాలున్నాయి.

నిందితుడు రాజుని పట్టిస్తే పదిలక్షల రివార్డును కూడా ప్రకటించింది ప్రభుత్వం. టెక్నికల్‌గా సీసీటీవీలను కనెక్ట్‌ చేసుకుంటూ వెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే బస్టాండ్స్‌, రైల్వే స్టేషన్లలో చెకింగ్‌ను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్‌కు కనెక్ట్‌ అయ్యే అన్ని హైవేలను జల్లెడపడుతున్నారు. వరంగల్‌ హైవే, విజయవాడ హైవే, సాగర్‌, శ్రీశైలం హైవేల్లో గాలింపు చేపట్టారు. ఈ రేపిస్టును పట్టివ్వండి.. రూ. 10 లక్షలు రివార్డు పొందండి.. వీడి ఆచూకీ తెలిస్తే… ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.. 9490616366, 9490616627 సెర్చ్ హిమ్- క్యాచ్ హిమ్.. ఇదీ పోలీస్ వారి ప్రకటన.

తాజాగా పోలీసులు కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. వాడు మారువేశాల్లో తిరిగే ఇలా ఉంటాడంటూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు.  ఫోటోలను పట్టుకుని నిందితులను పట్టుకునేవారు పోలీసులు. టెక్నికల్ గా ఎంత ట్రై చేసినా కుదరక పోవడంతో.. తమ దగ్గరున్న నిందితుడి ఫోటో ఆధారంగా పట్టుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. దాదాపు వెయ్యిమంది పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి- యాదాద్రి- నల్గొండ- కరీంనగర్ జిల్లా పోలీసులను అలెర్ట్ చేశారు అధికారులు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.. నిందితుడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో ఆచూకీ దొరకడం- పోలీసులకు కష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి: Rajamouli: మరో అద్భుతానికి తెర తీయనున్న జక్కన్న.. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం..?