గుండె పోటుతో భర్త మృతి అంటూ సీన్ క్రియేట్ చేసింది.. కానీ అసలు విషయం బయటపెట్టిన కొడుకు.. షాకైన పోలీసులు

దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు ఇలా రోజు ఏదో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా.. నిండు ప్రాణాలు.

గుండె పోటుతో భర్త మృతి అంటూ సీన్ క్రియేట్ చేసింది.. కానీ అసలు విషయం బయటపెట్టిన కొడుకు.. షాకైన పోలీసులు

దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు ఇలా రోజు ఏదో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా.. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బయట పగలు ప్రతీకారాలతో హత్యలు కొనసాగుతుంటే.. కట్టుకున్న భార్యలే భర్తలను హత్య చేస్తూ కటకటాల పాలవుతున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో ఆలస్యంగా చోటు చేసుకున్న ఆ ఘటన సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తను చున్నీతో హత్య చేసి గుండెపోటులో చనిపోయాడంటూ చిత్రీకరించిందో భార్య. రెండు నెలల క్రితం జూలై 16 ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా, నిందితురాలి కొడుకు తన తల్లి హత్య చేసిన విషయాన్ని అతని బాబాయ్‌ ప్రసాద్‌కి తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రసాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, మృతుడు జగదీష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే సుశ్రీతను 2007లో వివాహం చేసుకున్నాడు. జగదీష్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరు తమ 11 ఏళ్ల కొడుకుతో కలిసి ఫిలింనగర్‌లోని బంజారాహిల్స్‌లో కొన్నెళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం జూలై16న సుశ్రీత భర్తను హాత్యచేసి గుండెపోటుతో చనిపోయాడంటూ ఇంట్లో వారిన నమ్మబలికింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బాలుడు తన తల్లే.. తండ్రి జగదీష్‌ను హత్యచేసిందంటూ చెప్పడంతో ఈ అమానుషం బయటపడింది. కొడుకు అసలు విషయం తెలుపడంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు భర్తను హత్య చేయడానికి కారణాలు ఏమిటి..? వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీ కూడా చదవండి: Mirchi Bajji: వ్యక్తి ప్రాణాలు తీసిన మిర్చి బజ్జీ.. తింటుండగా.. గొంతులో ఇరుక్కుని..

Peacocks dead: చిత్తూరు జిల్లాలో ఐదు నెమళ్లు మృతి.. కుంట వద్ద పడి ఉన్న కళేబరాలు..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu