AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: మరో అద్భుతానికి తెర తీయనున్న జక్కన్న.. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం..?

Rajamouli: రాజమౌళి.. ఇప్పుడీ పేరు తెలియన సగటు భారతీయుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాహుబలి చిత్రంతో యావత్ దేశం దృష్టిని తనవైపు..

Rajamouli: మరో అద్భుతానికి తెర తీయనున్న జక్కన్న.. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం..?
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 19, 2021 | 7:27 PM

Share

Rajamouli: రాజమౌళి.. ఇప్పుడీ పేరు తెలియన సగటు భారతీయుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాహుబలి చిత్రంతో యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు రాజమౌళి. ఇప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడుతోంది. అంతలా తన ముద్రను వేశారు జక్కన్న. ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌తో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఇంకా విడుదలవ్వకముందే రాజమౌళి తర్వాతి చిత్రంపై అందరి దృష్టి పడింది.

రాజమౌళి తెరకెక్కించబోయే తర్వాతి సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ రాజమౌళితో ఓ భారీ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు.? సినిమా కథ ఎంటన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌ తర్వాత రాజమౌళి మహేష్‌ బాబును డైరెక్ట్‌ చేయనున్న విషయం తెలిసిందే. మరి మైత్రీ తెరకెక్కించబోయే సినిమానే మహేష్‌దే అవుతుందా.? లేదా మరో కొత్త సినిమా కోసం నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతోందా? లాంటి వివరాలు రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Also Read: RP Patnaik: సైదాబాద్ నిందితుడు రాజుని పట్టిస్తే క్యాష్ రివార్డు.. ఆర్పీ పట్నాయక్ ప్రకటన

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్.. బిగ్‏బాస్ సరయు సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 5 Telugu: కంటతడిపెట్టుకున్న లోబో.. మగాడివైతే ఆడుదువురా అంటూ రెచ్చగొట్టిన ప్రియా. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ..

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌