RP Patnaik: సైదాబాద్ నిందితుడు రాజుని పట్టిస్తే క్యాష్ రివార్డు.. ఆర్పీ పట్నాయక్ ప్రకటన

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రా హత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

RP Patnaik: సైదాబాద్ నిందితుడు రాజుని పట్టిస్తే క్యాష్ రివార్డు.. ఆర్పీ పట్నాయక్ ప్రకటన
Saidabad Rape And Murder Case
Follow us

|

Updated on: Sep 15, 2021 | 4:01 PM

Hyderabad Crime News: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచారం ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంరేపుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాజు ఆచూకీకి సంబంధించి సమాచారం ఇచ్చే వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైదాబాద్ ఘటనపై స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే నిందితుడు రాజు దొరకాలన్నారు. నిందితుడిని పట్టుకున్న వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే తనవంతుగా నిందితుడిని పట్టించినవారికి రూ.50వేల రివార్డు ఇవ్వనున్నట్లు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఇచ్చిన క్లూస్ అన్ని మనకు హెల్ప్ కావచ్చు..కాకపోవచ్చన్న ఆర్పీ.. అయితే నిందితుడి చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టిస్తుందన్నారు. నిందితుడు రాజు మీ దగ్గర్లోనే ఉండచ్చని.. ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. నేరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా పోలీసులకు సహకరిద్దామంటూ ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు.

Saidabad Rape Case

Saidabad Rape Case

మరిన్ని క్లూస్ విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు..

ఇదిలా ఉండగా నిందితుడి రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజు ఆచూకీపై సమాచారం ఇచ్చేవారికి హైదరాబాద్ పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం తెలిసిందే. అతని ఆచూకీపై డీసీపీ(ఈస్ట్ జోన్)- 9490616366, డీసీపీ(టాస్క్ ఫోర్స్)- 9490616627కు సమాచారమివ్వాలని పోలీసులు కోరారు.

Also Read..

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు సినీ తారల క్యూ.. సెల్ఫీల ఫ్యాన్స్ గోల..

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ తిరస్కరణ