Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు సినీ తారల క్యూ.. సెల్ఫీల ఫ్యాన్స్ గోల..

టాలీవుడ్ సెలబ్రెటీలకు డ్రగ్స్ కేసులో ఉచ్చు బిగిస్తుంది. ఇటీవల ఈ కేసును సీరియస్‏గా తీసుకున్న ఈడీ.. సెలబ్రెటీల నుంచి కూపీలు లాగుతున్న

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు సినీ తారల క్యూ.. సెల్ఫీల ఫ్యాన్స్ గోల..
Mumaith
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 3:13 PM

టాలీవుడ్ సెలబ్రెటీలకు డ్రగ్స్ కేసులో ఉచ్చు బిగిస్తుంది. ఇటీవల ఈ కేసును సీరియస్‏గా తీసుకున్న ఈడీ.. సెలబ్రెటీల నుంచి కూపీలు లాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువరు ప్రముఖులు ఈడీ అధికారులు ప్రశ్నించారు. పూరీజగన్నాథ్, రకుల్, ఛార్మీ, రానా, నందు, నవదీప్ వంటి ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు లోతుగా ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‏తో టాలీవుడ్ తారలకు ఉన్న సంబంధాలపై ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ ఆఫీసుకు ముమైత్ ఖాన్ హజరయ్యారు. ప్రస్తుతం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇక ముమైత్ ఖాన్‏ను మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలన, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా.? తదతర వివరాలపై ముమైత్ ను విచారించిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు సినీ తారల విచారణ జరుగుతుంటే మరోవైపు విచారణ ముగిశాక సెల్ఫీల గోల హల్చల్ చేస్తుంది … ఈడీ విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ నుంచి ఈరోజు ముమైత్ వరకు ఉదయం అరగంట, సాయంత్రం గంట సేల్ఫీలకె పోతుంది… ఈడీ అధికారుల ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ ముగిశాక ఈడీ బిల్డింగ్‏లో ఉన్న ఎంప్లాయస్ అంత సెల్ఫీలు దిగుతున్నారు … పూరీ జగన్నాధ్ గంట గంటన్నర పాటు సెల్ఫీలు దిగితే, ఛార్మి గంట, రకూల్ గంట, రవితేజ గంట, రానాకి రెండు గంటలు పట్టింది … ఇక తాజాగా ముమైత్ సైతం సెల్ఫీలకు విచారణ ప్రారంభం కాకముందే పోజులు ఇచ్చింది. ఇక ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.

Also Read: Leharaayi Lyrical Song: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న లెహరాయి లిరిక్స్..

Bigg Boss 5 Telugu: కంటతడిపెట్టుకున్న లోబో.. మగాడివైతే ఆడుదువురా అంటూ రెచ్చగొట్టిన ప్రియా. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ..