Bigg Boss 5 Telugu: కంటతడిపెట్టుకున్న లోబో.. మగాడివైతే ఆడుదువురా అంటూ రెచ్చగొట్టిన ప్రియా. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ..

బిగ్‌బాస్‌ 5 తెలుగు: బిగ్‌బాస్‌ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. తొలి వారం గడిచేసరికి హౌజ్‌ సభ్యుల్లో ఉన్న ఫస్ట్రేషన్‌ మెల్లిగా బయటపడుతోంది. అసహనాలు కట్టలు తెచ్చుకుంటూ...

Bigg Boss 5 Telugu: కంటతడిపెట్టుకున్న లోబో.. మగాడివైతే ఆడుదువురా అంటూ రెచ్చగొట్టిన ప్రియా. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 15, 2021 | 2:54 PM

బిగ్‌బాస్‌ 5 తెలుగు: బిగ్‌బాస్‌ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. తొలి వారం గడిచేసరికి హౌజ్‌ సభ్యుల్లో ఉన్న ఫస్ట్రేషన్‌ మెల్లిగా బయటపడుతోంది. అసహనాలు కట్టలు తెచ్చుకుంటూ మాటల యుద్ధం పెరుగుతోంది. తొలి వారం సరయు హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక రెండో వారం ఎలిమేషన్‌ ప్రాసెస్‌కూడా ప్రారంభమైంది. ఇక బిగ్‌బాస్‌ తాజాగా ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌ రసాభాసగా మారింది. ఇందులో భాగంగా రెండు టీమ్స్‌గా విడిపోయిన హౌజ్‌ మేట్స్‌ ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు కూడా దిగుతున్నట్లు అర్థమవుతోంది.

ఇక బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోను చూస్తుంటే కెప్టెన్సీ టాస్క్‌ మరింత రసవత్తరంగా మారినట్లు కనిపిస్తోంది. యాంకర్‌ రవి మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడు అంటూ శ్రీరామ్‌ ఆరోపించారు. ‘నువ్వు సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటే ఆడు కానీ.. నాతో మైండ్‌ గేమ్‌ మాత్రం ఆడకు’ అంటూ స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చాడు శ్రీరామ్‌. ఇక శ్రీరామ్‌కు మానస్‌ల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు వెళ్లింది. శ్రీరామ్‌ నీ వయసు ఎక్కువ ఉన్నా మెచ్యూరిటీ లేదంటూ మానస్‌ చేసిన వ్యాఖ్యలు హౌజ్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాయి. ఇదే సమయంలో హౌజ్‌లో ఉన్న లోబో ఒకానొక సమయంలో కంటతడి పెట్టుకున్నాడు.

టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు టార్గెట్ చేద్దాం అంటూ రవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్రియా ఒక అడుగు ముందుకేసి.. ‘మగాడివి అయితే ఆడుదువురా’ అంటూ సన్నీపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది. అదే స్థాయిలో బదులిచ్చిన సన్నీ.. ‘మీరు మగాడు, గిగాడు అని మాట్లాడొద్దు’ అంటూ హెచ్చరించాడు. దీంతో ఇదంతా చూస్తుంటే ఈ రోజు బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనట్లు అర్థమవుతోంది. మరి హౌజ్‌ మేట్స్‌ రచ్చకు సంబంధించిన ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Anu Emmanuel: పరువాల వెన్నెల.. మారింది సన్నజాజిలా.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఇలా..

Naveen Polishetty: జోరు పెంచిన జాతిరత్నం.. నయా సినిమాను అనౌన్స్ చేసిన నవీన్ పోలిశెట్టి

Pooja Hegde : సల్మాన్‌తో పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..