AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika & Ranveer: చిన్న గ్రామంలో ఇల్లు కొన్న దీపికా దంపతులు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్ర్లీలో బ్యూటీఫుల్ కపూల్స్‏లో దీపికా పదుకొనే.. రణవీర్ సింగ్ దంపతులు కూడా ఒకరు. ఈ జంట సినీ పరిశ్రమలో ఎప్పుడూ

Deepika & Ranveer: చిన్న గ్రామంలో ఇల్లు కొన్న దీపికా దంపతులు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Deepika
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 2:58 PM

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్ర్లీలో బ్యూటీఫుల్ కపూల్స్‏లో దీపికా పదుకొనే.. రణవీర్ సింగ్ దంపతులు కూడా ఒకరు. ఈ జంట సినీ పరిశ్రమలో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షనే. ఇక ఈ జంట అటు తమ తమ ప్రొఫెషనల్ కెరీర్‏లో ఎంత బిజీగా ఉన్నా.. తమ వ్యక్తిగత జీవితానికి కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రస్తుతం దీపికా.. రణవీర్ సింగ్ ఎవరికి వారు వరుస చిత్రాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్న… సమయం దొరికినప్పుడు ఇద్దరు కలిసి విదేశాలకు చెక్కెస్తుంటారు. అలాగే సినిమాలతోపాటు.. వాణిజ్య ప్రకటనలతోనూ ఈ జంట తీరిక లేకుండా ఉంటూనే.. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఈ జంట మహారాష్ట్రాలోని ఓ చిన్న గ్రామంలో ఖరీదైన ఇల్లు కొన్నారు.

మహారాష్ట్రాలోని అలిబాగ్‏లోని మాప్‏గావ్ అనే గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ఆ ఇళ్లు ధర రూ. 22 కోట్లు. తాజా సమాచారం ప్రకారం ఆ ఇళ్లు పూర్తిగా 2.25 ఎకరాలలో విశాలంగా నిర్మించారట. గతంలో ఈ బంగ్లా ది ఎవర్ స్టోన్ గ్రూప్ అధినేత రాజేష్ జగ్గికు చెందినదిగా సమాచారం. సెప్టెంబర్ 13న ఈ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిందని.. స్టాంప్ డ్యూటీగా రూ. 1.32 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. ఈ విశాలమైన ఇంటిలో 5 పడక గదులు ఉండగా.. కిహిమా బీచ్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో ఉందట. అలిబాగ్ ప్రాంతంలో బాలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించిన బిల్డింగ్స్ అనేకం ఉన్నాయి. ఇక అదే ఏరియాలో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు దీపిక దంపతులు.

Also Read: Naveen Polishetty: జోరు పెంచిన జాతిరత్నం.. నయా సినిమాను అనౌన్స్ చేసిన నవీన్ పోలిశెట్టి

Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..