AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

డ్రగ్స్ .. ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సమ్యస ఇది..సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ రచ్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్..

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..
Mumaith
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2021 | 11:06 AM

Share

Tollywood Drug Case: డ్రగ్స్ .. ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సమ్యస ఇది..సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ రచ్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు… సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అలాగే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోయిన్స్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ మత్తు టాలీవుడ్ కూడా ఎక్కుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారం పై ప్రత్యక దృష్టి పెట్టిన ఈడీ అధికారులు పలువురు సినిమా తారలను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పూరిజగన్నాథ్, ఛార్మి , రకుల్ , రవితేజ, రానా, నందు, నవదీప్‌‌‌లను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాల పైన విచారణ జరిపారు అధికారులు. అలాగే వారి బ్యాక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ముమైత్ ఖాన్ ఈడీ అధికారులు ముందు హాజరయ్యింది. కొద్దిసేపటి క్రితమే ముమైత్ ఖాన్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలన,  అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయనున్నారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా.? తదతర వివరాలపై ముమైత్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇక ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ..

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..