Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

అక్కినేని నాగ చైతన్య ఇటీవల కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. మనం సినిమా తర్వాత నుంచి చైతన్య చాలా సెలక్టివ్‌గా సినిమాలను దర్శకులను ఎంచుకుంటున్నాడు.

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..
Love Story
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2021 | 9:51 AM

Love Story : అక్కినేని నాగ చైతన్య ఇటీవల కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. మనం సినిమా తర్వాత నుంచి చైతన్య చాలా సెలక్టివ్‌గా సినిమాలను దర్శకులను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మజిల్ అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. మజిలీ సినిమాలో చైతన్య నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లవ్ స్టోరీ అనే సింపుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక వినాయక చవితి సందర్భంగా విడుదుల చేద్దాం అనుకుంటే నాని నటించిన టక్ జగదీష్ సినిమా అదే రోజు ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. దాంతో లవ్ స్టోరీ వెనక్కి తగ్గింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నిడివి కూడా సుమారుగా 2గంటల 46నిమిషాలు వాచినట్టు తెలుస్తుంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మాస్ట్రో ఈవెంట్‏లో ఏం మాట్లాడిందంటే..

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

Happy Birthday Ramya Krishnan: ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు

ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!