Happy Birthday Ramya Krishnan: ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు..

రమ్యకృష్ణ.. ఎవర్‌గ్రీన్, బ్యూటీఫుల్, సూపర్ క్యూట్.. ఇలా ఎన్ని పదాలు వాడినా.. ఆమె గురించి తక్కువ చెప్పినట్లే అవుతోంది. కేవలం అందం మాత్రమే కాదు నటన విషయంలో కూడా ఆమెకు ఆమే సాటి. బుధవారం(సెప్టెంబరు 15) రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

|

Updated on: Sep 15, 2021 | 2:31 PM

కృష్ణన్, మాయ దంపతులకు 1970, సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ జన్మించారు. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చారు.

1 / 5
రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'వెళ్ళై మనసు' అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సౌత్‌లో అందరు అగ్ర హీరోల సరసన ఆమె ఆడిపాడారు. ఏ పాత్ర వేసినా 100 శాతం న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత.

2 / 5

 'భలే మిత్రులు' అనే సినిమాతో రమ్యకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూత్రధారులు' అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ఆమె స్టార్ తిరిగిపోయింది.

3 / 5
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్​,  నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్,  జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్​ బాబు, ప్రభాస్​లతో కలిసి నటించారు.

4 / 5
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న 'శివగామి' పాత్రతో మరోసారి తన నటనా స్థాయిని ప్రపంచానికి చూపించారు. 'బాహుబలి: ద బిగినింగ్' సినిమాకుగానూ ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు దక్కించుకున్నారు. 'బాహుబలి: ద కంక్లూజన్' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డును అందుకున్నారు.

5 / 5
Follow us