AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ..

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాటి గాంధీ తెరకెక్కి్స్తున్న సినిమా మాస్ట్రో. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‏గా

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ..
Mangli
Rajitha Chanti
|

Updated on: Sep 15, 2021 | 2:59 PM

Share

టాలెంటెడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాటి గాంధీ తెరకెక్కి్స్తున్న సినిమా మాస్ట్రో. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా నెగిటివ్ పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అందుకున్న అంధాధూన్ సినిమాకు తెలుగు రీమేక్‏గా మాస్ట్రో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్టెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండంతో నిన్న మాస్ట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో సింగర్ మంగ్లీ కూడా నటిస్తోంది. ఈ సందర్భంగా నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంగ్లీ.. హీరో నితిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంగ్లీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. అది నాకు బాగా సెట్ అయ్యే పాత్ర.. నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిది.. నితిన్‏ హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా మాతో కలిసిపోయారు. చాలా ఫ్రెండ్లీగా.. ఒక బ్రదర్ లాగా చూసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది మంగ్లీ. ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read: Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ నుంచి రానా గ్లింప్స్‌.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..

Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. ఆ డైలాగ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట..

Bigg Boss 5 Telugu: ఈసారి సన్నీపై రెచ్చిపోయిన ఉమా.. ఇలాగే మాట్లాడతా అంటూ కౌంటర్స్..

Follow Us
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు