Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. ఆ డైలాగ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట..

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ములు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందమైన ప్రేమకథలకు ఎంచుకుంటూ..సైలెంట్‌‌గా

Love Story: లవ్ స్టోరీ సినిమా పై వివాదం.. ఆ డైలాగ్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయట..
Love Story
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2021 | 9:03 AM

Love Story: టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ములు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందమైన ప్రేమకథలకు ఎంచుకుంటూ..సైలెంట్‌‌గా విజయాలను అందుకుంటున్నారు శేఖర్ కమ్ముల అయితే.. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిచిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈసినిమా మొనీమధ్య వినాయక చవితి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ నాని నటించిన టక్ జగదీష్ సినిమా వల్ల ఈ మూవీ వాయిదా పడింది. ఎట్టకేలకు ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది లవ్ స్టోరీ.. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ సినీలవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. క్షణాల్లో ఈ ట్రైలర్‌కు లైకులు వర్షము కురిసింది. ఇక తక్కువ టైమ్‌లోనే 2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది ఈ ట్రైలర్. అయితే ఈ ట్రైలర్‌లోని ఓ డైలాగ్ పై ఇప్పుడు వివాదం రేగింది.

లవ్ స్టోరీ మూవీలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. హీరో లోన్ కోసం ఒక బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో గొర్రెలోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలనే మేపుతాడు.. రిక్షావాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు అంటూ చైతన్య ఓ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్ పై కొంతమంది టీఆర్ ఎస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. గొర్రెలోడికి గొర్రెలిస్తే తప్పు అయితే సినిమాలు తీసేవాళ్ళు సినిమాలే తీస్తారా వేరే వ్యాపారాలు చేయరా.. ప్రతి ఒక్కళ్ళూ సర్కార్ పథకాల పై సెటర్స్ వేసేవాళ్ళే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఈ రచ్చ పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: ఈసారి సన్నీపై రెచ్చిపోయిన ఉమా.. ఇలాగే మాట్లాడతా అంటూ కౌంటర్స్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..

Tollywood Drug Case: ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.. నేడు ఈడీ అధికారుల ముందుకు ..