Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..

తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది ఈ గేమ్.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2021 | 7:57 AM

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది ఈ గేమ్. ఇక ఇప్పుడు సీజన్ 5 సాగుతుంది. 16 నుంచి 20 మంది కంటెస్టెంట్స్‌ను ఓ హౌస్‌లో ఉంచి వారికి  రకరకాల టాస్కులు ఇచ్చి.. గొడవలు పెడుతుంటాడు బిగ్ బాస్. ఆ టాస్కుల్లో విజయం సాధించడానికి ఇంటి సభ్యులంతా కింద మీద పడుతూ ఉంటారు. దాంతోపాటే గొడవలు, అరుపులు, ఏడుపులు ఇలా నానా హంగామా ఉంటుంది బిగ్ బాస్‌లో అయితే బిగ్ బాస్ గేమ్ షో పైన పాజిటివిటీ ఎంత ఉందొ.. నెగిటివిటీ కూడా అంతే ఉంది. బిగ్ బాస్ పై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తునే ఉన్నాయి. బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ గేమ్ షోను వెంటనే బ్యాన్ చేయాలనీ.. దీని పై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.

బిగ్ బాస్ షో  సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం డబ్బులు సంపాదించడానికి ఇలాంటివి చేయాలా.? అని ఆయన ప్రశ్నించారు. బిగ్ బాస్ గేమ్ షో కమర్షియల్ కాదు సమాజానికి చీడ పురుగులాంటిదని నారాయణ అభిప్రాయ పడ్డారు. అలాగే ఈ వాదన పై బాబు గోగినేని మాట్లాడుతూ.. బిగ్ బాస్ గేమ్ గురించి తెలియని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ వల్ల సమాజంలో ఎలాంటి దుర్మార్గం జరగడం లేదు అని అన్నారు. ఇక కంటెస్టెంట్ అఖిల్ మాట్లాడుతూ.. మీ ఒక్కరికి నచ్చకపోయినంత మాత్రానా  బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలా.? అంటూ అఖిల్ ప్రశ్నించాడు. దీనికి నారాయణ స్పందిస్తూ.. ఇది సమాజానికి చెడు చేస్తుంది. మొదటినుంచి నేను దీనిపై వెతిరేకంగానే మాట్లాడుతున్నా .. పోలీస్ కేసు కూడా పెట్టాను అన్నారు. మొత్తానికి బిగ్ బాస్ గేమ్ షో ను బ్యాన్ చేయాలన్న వాదన గట్టిగ వినిపిస్తుంది. మరి దీనిపై నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టండి..

Big Boss Season 5: బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!