Big Boss Season 5: బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా

Big Boss season 5: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అక్కడ నుంచి ఇతర ప్రాంతీయ భాషల్లోకి అడుగు పెట్టిన షో బిగ్ బాస్.. ఈ షో తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ లోకి అడుగు పెట్టింది. కింగ్ నాగార్జున..

Big Boss Season 5: బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా
Manas

Big Boss season 5: హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అక్కడ నుంచి ఇతర ప్రాంతీయ భాషల్లోకి అడుగు పెట్టిన షో బిగ్ బాస్.. ఈ షో తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ లోకి అడుగు పెట్టింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ బిగ్ బాస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వైపు విమర్శలు వినిపిస్తున్నా మరోవైపు రోజు రోజుకీ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ హిట్ షో గా దూసుకుపోతుంది. ఈ షో లో 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగా అందులోకి ఒకరు మానస్. బాలనటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన మానస్.. హీరోగా విలన్ గా నటిస్తూనే బుల్లి తెరపై కోయిలమ్మ సీరియల్ తో అడుగు పెట్టాడు.. నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

1991ఆగస్టు 2న మానస్ జన్మించాడు. తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మిని దేవి. ఇద్దడు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్. తండ్రి వెంకట్రావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. దీంతో మానస్ బాల్యం చదువు ముంబై, వైజాగ్, గోవా తదితర ప్రదేశాల్లో సాగింది. తల్లి పద్మిని దేవి ఆంధ్రా యూనివర్సిటీలో లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. మానస్ ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. మానస్ భోగరాజు గంగరాజు కాలేజీ బిటిక్ పూర్తి చేశాడు. విదేశంలో ఎంఎస్ చేశాడు అనంతరం భారత్ కు తిరిగి వచ్చి సినిమాలపై దృష్టి పెట్టాడు.

బాల్యం నుంచి యాక్టింగ్ అన్నా డ్యాన్స్ అన్నా మానస్ కు చాలా ఇష్టం.. బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసిన మానస్ .. బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక చిన్న పిల్లలతో తెరకెక్కించిన ‘హీరో’ మానస్ నటనకు గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నాడు. అప్పట్లో దివంగత సీఎం రాజశేఖర్ చేతులమీదుగా అవార్డు ను అందుకున్నాడు. ఇక చదువులో కూడా మంచి ప్రతిభ కనబరిచే మానస్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ప్రశంసా ప్రతాన్ని అందుకున్నాడు.

హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన మానస్ సోడా గోలి సోడా, ప్రేమికుడు,గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజ్‌ కాయ్‌, ఝలక్ వంటి అనేక సినిమాల్లో నటించాడు. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన నక్షత్రం లో తనీష్ తో కలిసి విలన్ కూడా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెరపై అడుగు పెట్టిన మానస్ మనసిచ్చి చూడు, . దీపారాధన సీరియల్స్ లో నటించాడు. ఇక డ్యాన్స్ పై ఉన్న ఇష్టంతో మానస్ వైజాగ్ గురజాడ కళాక్షేత్ర వంటి చోట్ల డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు ఇక మానస్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానంతో పవన్ అభిమానులు మానస్ ను ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్తాడు. పవన్ అభిమానులతో కలిసి ఆ ప్రోగ్రాం లో పాల్గొంటాడు. మరి బిగ్ బాస్ హౌస్ లో మానస్ తనదైన ముద్ర వేసే దిశగా జర్నీ మొదలు పెట్టాడు.

Also Read: అథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై దాదాపు రూ 24 వేల డిస్కౌంట్.. ఎక్కడ అంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu