Krishnam Raju Hospitalised: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు.. పూర్తి వివరాలు

నటుడు కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో కాలుజారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయ్యింది.

Krishnam Raju Hospitalised: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు.. పూర్తి వివరాలు
Krishnam Raju
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:42 PM

Krishnam Raju: సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోగా.. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.

కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుందని.. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు గారు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు స్వస్థలం. రెబల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సాధించిన కృష్ణంరాజు.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 183 సినిమాల్లో నటించారు. జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, సతి సావిత్రి, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, మరణ శాసననం, అంతిమ తీర్పు, పల్నాటి పౌరుషం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. మూడుసార్లు నంది అవార్డులు, ఐదుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.

1990లలో ఆయన క్రియాశీల రాజకీయాల్లోనూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ)లో ఆయన గతంలో పనిచేశారు. బీజేపీలో రెండు సార్లు(కాకినాడ, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్యకాలంలో ధివంగత వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. 2009లో ఆయన చిరంజీవి సారథ్యంలోని ప్రజరాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Also Read..

Samantha Naga Chaitanya: ఆసక్తికరంగా చైతూ.. సామ్ ట్విట్స్.. ఇక రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే